తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వినిపించిన నినాదాల్లో ముఖ్యమైనది.. ''విడిపోయి కలిసి ఉండటం'. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మాటను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నకేసీఆర్ అనే మాట పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే ఆయన మాటలు ఉంటాయి.
ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వారెవరూ కూడా తెలంగాణ రాష్ట్రం మీద వ్యాఖ్యలు చేయటం కనిపించదు. అందుకు భిన్నంగా తెలంగాణ సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ మాత్రం సమైక్య పాలకులు.. ఉమ్మడి రాష్ట్రం పేరుతో నిందించటం నేటికి చూస్తున్నాం. ఇవాల్టి రోజున తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడే కన్నా.. కలిసి ఉంటేనే బాగుంటుందన్న మాట అప్పుడప్పుడు ఉద్యమ నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏపీలో తమను పార్టీ పెట్టాలని అడుగుతున్నారని.. పార్టీ పెడితే గెలిపించుకుంటామన్న మాట ఏపీకి చెందిన పలువురు తమకు ఫోన్లు చేసి చెబుతున్నట్లుగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్ష నేతలు రియాక్టు అవుతున్నారు.
ఏపీలో పార్టీ పెట్టాలన్న సూచన తమకు వస్తున్నట్లు చెబుతున్న సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట.. భవిష్యత్తులో రాకుండా ఉండేలా ఏపీ మంత్రి పేర్ని నాని తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పెట్టాలని తామూ కోరుకుంటున్నామన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ.. తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే కోరుకున్నారంటూ.. కేసీఆర్ గొంతులో వెలక్కాయ పడేలా వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్ని కలిపేస్తే మంచిదే కదా? అన్న పేర్ని నాని మాటలు వింటే.. లేనిపోని విషయాన్ని ప్రస్తావించానే అన్న భావన కేసీఆర్ కు కలగటం ఖాయం. గతంలో సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలకు కామ్ గా ఉండే వైసీపీ నేతలు తాజాగా మాత్రం అందుకు భిన్నమైన ధోరణిని అనుసరిస్తుండటం గమనార్హం.