తెలుగుదేశం నేత నన్నపనేని రాజకుమారి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి అందజేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు.
''మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్ కు అందజేశా. నా నివేదికను చూసి గవర్నర్ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచా'' అని కొత్త గవర్నమెంటు వచ్చాక కూడా కొంతకాలం రాజీనామా చేయకపోవడం కారణాన్ని వివరించారు. కాలపరిమితి ప్రకారం అయితే ఆమె పదవీ కాలం ముగియలేదు. అందుకే జగన్ ఆమోదం లభిస్తే పదవిలో కొనసాగుదాం అనుకున్నారని, జగన్ ని కలవడానికి అప్పట్లో క్యాంప్ ఆఫీసుకు వెళ్లడానికి కారణం అదే అప్పట్లో వార్తలు వచ్చాయి.
కొత్త మహిళా కమిషన్ చైర్ పరన్స్ గా వైఎస్ ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మను ముఖ్యమంత్రి నియమించారు. ఇదిలా ఉండగా... పాత కొత్త చైర్ పర్సన్ లు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.