అధికారపక్షంలో ఉన్న వారేం చేసినా నడిచిపోతుందని భావిస్తుంటారు. అదే సమయంలో.. విపక్షంలో ఉన్న వారు ఏం మాట్లాడినా చెల్లిపోతుందన్న భావన ఉంటుంది. కానీ.. ఈ రెండూ తప్పే. ఆ విషయం మామూలుగా చెబితే అర్థమయ్యేది కాదు. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల పుణ్యమా అని ఇలాంటివి ఎంత తప్పన్న విషయం ఇట్టే తెలిసే పరిస్థితి.
తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నరిసిరెడ్డి మాటల్నే తీసుకుందాం. ఆయన.. తెలంగాణ ప్రభుత్వం హామీలు ఇచ్చిన రీతిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా..మంత్రుల మీదా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఏడాది లోపు యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని.. ఇప్పటివరకూ ఏమీ చేయలేదని తప్పు పట్టారు.
రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. అసెంబ్లీలో మాత్రం లక్షా ఏడువేల ఖాళీలు ఉన్నట్లుగా ప్రకటించారని తప్పు పట్టారు.ఇలా లెక్కలు చెబుతూ.. తెలంగాణ సర్కారుపై విరుచుకుపడిన నరిసిరెడ్డిని ఎక్కడా తప్పుపట్టాల్సింది లేదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తీవ్రంగా విమర్శిస్తూ.. రాత్రికి రాత్రి పార్టీ మారి.. రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని.. మంత్రి పదవిని పొందారంటూ విమర్శించారు.
ఈ మాట మాట్లాడిన నరిసిరెడ్డిని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తలసాని రాత్రికి రాత్రిపార్టీ మారి రాజకీయ వ్యభిచారానికి పాల్పడితే.. ఏపీలో అధికారంలో ఉన్న తమ పార్టీ సైతం.. విపక్షాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేల్ని రాత్రికి రాత్రి పార్టీ మార్చేసిన విషయాన్ని ఆయన మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తలసాని చేసింది రాజకీయ వ్యభిచారమే అయితే.. ఏపీలో విపక్ష ఎమ్మెల్యేల్ని పార్టీ మారిపోయేలా చేసిన ఏపీ అధికారపక్ష నేత చేయించిన పనిని ఏమనాలి? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకే.. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త వెనుకా ముందు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. లేకుంటే.. తూటాల్లాంటి మాటలు ప్రత్యర్థులపై ఫైర్ కావటం తర్వాతి సంగతి..మిస్ ఫైర్ అయి మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని తమ్ముళ్లు గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/