టీడీపీలో ఎన్నడూ లేని విధంగా కొత్త స్లోగన్ ని చంద్రబాబు అందుకున్నారు. ఈ తడవ నన్ను మొహమాటపెట్టవద్దు, మీరు అసలే ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ఈసారి కీలకమైన ఎన్నికల పరీక్ష జరగనుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. ఇదీ సీనియర్లకు చంద్రబాబు చేసిన హితోపదేశం. వచ్చే ఎన్నికల్లో టికెట్లు సీనియర్లకు కట్ అని చంద్రబాబు చాలా కూల్ గా చెప్పేశారు.
అలాగని మీ గౌరవానికి ఏమీ భంగం వాటిల్లదు. హాయిగా పార్టీ పదవుల్లో ఉండవచ్చు అని కూడా అంటున్నారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు, మంత్రులుగా సింహాసనాలు మాత్రం ఇచ్చేది లేదు అని ఖరాఖండీగా బాబు చెప్పేశారు అన్న మాట. ఈ మాటలే సీనియర్లకు ఎక్కడా మింగుడుపడడంలేదుట.
తాము కూడా పార్టీ పునాదుల నుంచి ఉన్నామని తమకూ తమ వారసులకూ కూడా టీడీపీలో రాజకీయ అధికార వాటా కావాల్సిందే అన్నది చాలా మంది మనోగతంగా ఉంది. అయితే వారసులకు టికెట్ విషయంలో కూడా ఆశలు నెరవేరేలా లేవు అంటున్నారు. ఒకే ఇంటి గుమ్మానికి ఏళ్లకు ఏళ్ళు అధికారంతో పాటు పదవులు అట్టేబెట్టేసుకుంటే మిగిలిన వారి సంగతేంటి అన్నది కార్యకర్తల ఆవేదన.
దాంతో టీడీపీ అధినాయకత్వం ఇన్నాళ్ళకు కళ్ళు తెరచింది అంటున్నారు. సీనియర్లు ఇక ఇంటికే. సత్తా ఉంటేనే వారి వారసులకు టికెట్లు. ఇక పార్టీ కోసం ఆరుగాలం పనిచేసిన యువతకు నలభై నుంచి యాభై శాతం టికెట్లు అని బాబు ప్రకటించేశారు. అంతే ఈసారి టీడీపీ నుంచి కొత్త ముఖాలను చూస్తారు అన్న మాట. మరి అదే జరిగితే చాలా మంది టీడీపీ రెగ్యులర్ నాయకులు అంతా కూడా సైడ్ అయిపోవాల్సిందే.
అయితే చంద్రబాబు ఈ ప్రకటన వెనక అనేక వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. సీనియర్లను దూరం పెట్టడం ద్వారా రేపటి రోజున యువ టీడీపీని నిర్మించి దానికి భావి నేతగా లోకేష్ కి చేస్తారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొన్నాళ్ళు పాలించిన తరువాత లోకేష్ చేతిలోనే పగ్గాలు పెడతారు అని ప్రచారం ఒక వైపు సాగుతోంది.
దాంతో నాడు సీనియర్ల నుంచి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగానే ఈ ఏర్పాటు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే చంద్రబాబు కొంతమంది మాత్రమే సీనియర్లుగా ఉంటారు. మిగిలిన వారు అంతా లోకేష్ బ్యాచ్ అన్న మాట. ఆ విధంగా చాలా సులువుగా టీడీపీని తన తరువాత లోకేష్ టేకోవర్ చేసేలా బాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు.
దీంతో ఈ విషయం మీద కూడా కిందా మీదా అవుతున్న సీనియర్లు ఇదంతా చంద్రబాబు ఆలోచనా లేక లోకేష్ బాబు మాస్టర్ ప్లానా అని కూడా డౌట్లు పడుతున్నారుట. ఏది ఏమైనా ఇక మీదట టీడీపీ లోకేష్ జమానాలో సాగాలీ అంటే షష్టి పూర్తి బ్యాచ్ తప్పుకోవాల్సిందే అని అంటున్నారు. అయితే చెప్పినంత ఈజీగా ఇది జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అన్నది కూడా చర్చిస్తున్నారు. అసలే విపక్షంలో టీడీపీ ఉంది. ప్రతీ ఒక్క ఓటూ ఇంపార్టెంట్ మరి. అలాంటి టైమ్ లో సీనియర్లు కనుక రివర్స్ అయితే చిక్కులూ చికాకులే. చూడాలి మరి ఏం జరుగుతుందో.