సెగలు రేపుతున్న ఆ మూడు సీట్లు...?

Update: 2022-05-02 02:30 GMT
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు సీట్లు ఇపుడు సెగ రేపుతున్నాయి. ఎన్నికలు రెండేళ్లకు పైగా ఉండగానే ఈ సీట్లలో రాజకీయం ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు ప్రత్యర్ధులకు గల్లంతు చేస్తామని అధికార విపక్షాలు సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇంతకీ ఆ హాట్ సీట్లు ఏంటి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, సీనియర్ మంత్రి పెద్ద్రెడ్డి రామచంద్రారెడ్డి సీట్లు పుంగనూరు. ఆయన సోదరుడు ద్వారకానాధ్ రెడ్డి సీటు తంబల్లపల్లె. ఈ మూడు సీట్ల విషయంలో అటూ ఇటూ మోహరించి మరీ రాజకీయ రచ్చకు తెర లేపుతున్నారు.

ఇక కుప్పమో చంద్రబాబుని ఈసారి ఓడించి తీరుతామని జగన్ ఒక వైపు పార్టీ నేతలతో చెప్పేసారు. బాబు సీటుతో సహా మొత్తానికి మొత్తం రావాల్సిందే అని ఆయన హుకుం జారీ చేశారు. మరో వైపు చూస్తే ఈసారి పెద్దిరెడ్డి సీటు పుంగనూరులో ఆయనకు డిపాజిట్లు రాకుండా చేస్తామని చంద్రబాబు గర్జిస్తున్నారు. అంతే కాదు, తంబల్లపల్లెలో కూడా వైసీపీని ఓడించి తీరుతామని కూడా శపధం చేస్తున్నారు.

దీని మీద ఘాటుగార్ రియాక్ట్ అయిన ద్వారకానాధ్ రెడ్డి అయితే ముందు తంబల్ల్లపల్లెకు వచ్చి పోటీ చేయండి బాబు గారూ, మీ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేస్తామని చాలెంజ్ చేసి మరీ చెబుతున్నారు. దీనికి ముందే పెద్దిరెడ్డి బాబుకు సవాల్ చేశారు. తన సీట్లో బాబు పోటీ చేయవచ్చు అని కూడా ఓపేన్ ఆఫర్ ఇచ్చారు.

ఇంకో వైపు పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచే కుప్పం సీట్లో బాబుకు పోటీగా అభ్యర్ధిని పెడతాని అంటున్నారు. ఇప్పటికి ఏడు సార్లు ఎమ్మెల్యే అయిన చంద్రబాబు కుప్పాన్ని మునిసిపాలిటీ చేయలేదని, అలాగే రెవిన్యూ డివిజన్ కూడా మంజూరు చేయలేదని, అభివృద్ధి చేసిన తమకే ఈసారి జనాలు ఓటు వేస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి చూస్తే పెద్దిరెడ్డి ఫ్యామిలీ వర్సెస్ చంద్రబాబు గా ఈసారి చిత్తూరు రాకీయం ఉండనుంది. మరి ఎవరికి డిపాజిట్లు పోతాయి. ఎవరు ఓడుతారు అంటే వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News