కొన్ని సార్లు ఒకే ఒక్క మాటే రీసౌండ్ చేస్తుంది. రాజకీయాల్లో అయితే అది దద్దరిల్లిపోతుంది కూడా. జగన్ ఈ మధ్యనే ఉత్తరాంధ్రా జిల్లాలలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఆయన ఒక నెలలో వరసబెట్టి మూడు సార్లు వచ్చారూ అంటేనే ఉత్తరాంధ్రా ఫోకస్ ఏంటి అన్నది అర్ధం చేసుకోవాలి. ఇక గత నెల చివరలో ఉమ్మడి విశాఖ జిల్లా టూర్ లో జగన్ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు.
అందులో ముఖ్యమైనది ఉత్తరాంధుల ఆత్మ గౌరవం గురించి. ఒక విధంగా ఇది సెంటిమెంట్. దాన్ని ఆయన టచ్ చేశారు అన్న మాట. ఉత్తరాంధ్రాకు తాను ఎంతో చేయాలనుకున్నా. ఏకంగా రాజధాని రాజసాన్నే తీసుకువద్దామనుకుంటే అడ్డుకుంటున్నారు అని టీడీపీ మీద బాణాలు సంధించారు. ఇలా జగన్ చేసిన బిగ్ సౌండ్ ఇపుడు రీ సౌండ్ చేస్తోంది.
అందుకే మహానాడు తరువాత జిల్లాల టూర్లు చేయాలని భావించిన చంద్రబాబు సడెన్ గా డెసిషన్ మార్చేసుకున్నారు. మొదటిగా వస్తూనే ఉత్తరాంధ్రాలో అందునా వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలోనే ఆయన టూర్ మొదలెట్టారు. ఇక విశాఖ జిల్లా మీదుగా గోదావరి జిల్లాలలో కూడా చంద్రబాబు పర్యటనలు ఉంటున్నాయి.
ఈ క్రమంలో విశాఖలోనే ఒక రోజు రాత్రి చంద్రబాబు ఉంటారు. పార్టీ ఆఫీస్ లో ఆయన విడిది చేస్తారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో రెండు రోజుల టూర్ చేస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతం ఆత్మగౌరవం గురించి రీ సౌండ్ చేస్తారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా గురించి తామేని చేసింది, ఏమి చేయబోతోంది అన్నది కూడా చంద్రబాబు విడమరచి చెబుతారు అని అంటున్నారు. ఒక విధంగా జగన్ లేవనెత్తిన ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవం నినాదానికి సరైన జవాబు చెబుతారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్రా సెంటిమెంట్ మాటున విశాఖ రాజధాని డిమాండ్ ని రగిలించే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి బిగ్ కౌంటర్ ఇస్తారని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే అటు జగన్ ఇలా వెళ్లాక ఇటు బాబు రావడం చూస్తూంటే ఉత్తరాంధ్రా నినాదం ఎవరి సొంతం, ఎవరి రాజకీయ పంతం ఏంటి అన్నది కూడా తేలనుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.