రాష్ట్రానికి రాజైనోడికి సొంతూరులో స్వాగతం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన సొంతూరు నారావారి పల్లెకు పయనమవుతారు.
మిగిలిన రోజుల్లో ఎక్కడెక్కడో ఉన్నా.. సంక్రాంతి పండక్కి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అంతా నారావారి పల్లెకు చేరుకుంటారు. సీఎంగా బిజీగా ఉండి మిగిలిన రోజుల్లో సొంతూరు పట్టనప్పటికీ.. సంక్రాంతి సందర్భంగా మూడు.. నాలుగు రోజులు సొంతూళ్లో ఉండటం అలవాటు చేసుకున్నారు చంద్రబాబు.
ఎప్పటి మాదిరి ఈసారి కూడా నారావారిపల్లెలో ఉన్న ఆయన.. గ్రామంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్థుల్ని అప్యాయంగా పలుకరించటంతో పాటు.. తన చిన్ననాటి స్నేహితులతో కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. గ్రామంలో తిరుగుతూ.. దారిలో కనిపించిన వారితో మాట్లాడారు.
తన వరసకు సోదరుడైన మురళీనాయుడు గత వారం మరణించటంతో ఆయన ఇంటికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తమ ఊరి వాడైన బాబు ఊళ్లో ఉండటంతో తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ వినతిపత్రాలు తీసుకొని పలువురు ఆయన వద్దకు వచ్చారు. వారిచ్చిన వినతుల్ని స్వీకరిస్తూ.. వారి సమస్యల్ని పరిష్కరిస్తానన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని.. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చెప్పాలంటూ అభయ హస్తాన్ని ఇచ్చారు. మరి.. మిగిలిన వారికి.. బాబు సొంతూరోళ్లకు ఆ మాత్రం తేడా లేకపోతే ఎలా..? ఏమైనా పల్లెలందు నారావారిపల్లె వేరయా అన్న విషయాన్ని బాబు తన మాటలతో.. చేతలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.