నారా లోకేశ్ నోటిదూల.. దండుపాళ్యం ముఠాగా వలంటీర్లంట

Update: 2020-03-03 05:13 GMT
సంక్షేమ పథకాల అమలులో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఇంటి వద్దకు సేవలు అందించేందుకు గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇటీవల మార్చి ప్రారంభం కావడంతో పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఇంటికి తెల్లవారుజామునే వెళ్లి మరీ వారిని మేల్కొలిపి ఇస్తున్నారు. అలాంటి వారిని పట్టుకుని మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లు రేప్ లు, పాపాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు వలంటీర్ల వ్యవస్థను దండుపాళ్యం ముఠాగా పేర్కొనడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై వలంటీర్లు తమ తమ ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం లోకేశ్ ట్వీట్ చేయగా దానిపై అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకులతో పాటు వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీటర్ లో వలంటీర్ల వ్యవస్థ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నారా లోకేష్‌పై ఫిర్యాదులు నమోదు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వారికి అండగా ఉండబోతున్నట్లు సమాచారం. జగన్ సర్కార్ కొత్తగా ప్రవేశ పెట్టిన వలంటీర్ల వ్యవస్థను ఉద్దేశించి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

"వలంటీర్లలో 90 శాతం వైకాపా కార్య‌క‌ర్త‌లే వాలంటీర్లు. వారు రేపులు చేసినా, పాపాలు చేసినా వైకాపా ఆశీస్సులున్నాయ‌ని అర్థం అవుతోంది. జగన్ గారు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను దండుపాళ్యం గ్యాంగుల్లా పూర్తిచేస్తున్న వాలంటీర్లకు వైకాపా హ్యాట్సాఫ్ చెప్ప‌డంలో వింతేముంది?" అని ట్వీట్ చేస్తూ ఓ ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో వివిధ పత్రికల్లో వలంటీర్లు నేరాలు, మోసాలు చేస్తున్నారని ఉంది.

ఈ ట్వీట్ ను చూసిన వారందరూ మండి పడుతున్నారు. తమ కార్యకర్తలు కావడం వల్లే వలంటీర్లు రేపులు చేసినా, పాపాలు చేసినా అధికార పార్టీ మద్దతు తెలుపుతోందని, నేరాలు, మోసాలకు వైఎస్సార్సీపీ సహకరిస్తోందని ఆరోపించారు. నారా లోకేశ్ పై ఫిర్యాదు తమను అత్యాచారాలు చేసే వారిగా, దండుపాళ్యం గ్యాంగుల్లా అభివర్ణించడం పై వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్లు నారా లోకేశ్ పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదల వద్దకు చేరుస్తున్న తమ విధులు, సేవలను లోకేశ్ తప్పుబట్టడం, వాటిని నేరాలుగా పరిగణించడం సరికాదని, తమకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News