బ్రదర్‌.. చినబాబు ఎంత సింపులో కదూ..!

Update: 2015-06-27 08:02 GMT
విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఒక అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీ నేతలు.. కార్యకర్తలే కాదు.. మీడియా సైతం ఈ అంశాన్ని గుర్తించి.. ప్రాధాన్యత ఇచ్చింది.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు.. చినబాబు లోకేశ్‌ వ్యవహరించిన తీరు హాట్‌ టాపిక్‌గా మారింది. సగటు కార్యకర్త మాదిరి.. సాదాసీదా డ్రెస్సులో పార్టీ ఐడీ కార్డు మెడలో వేసుకొని.. పెన్ను పేపరు పట్టుకొని కార్యకర్తల మధ్యలో కూర్చోవటం అందరి దృష్టిని ఆకర్షించింది.

సమావేశం ప్రారంభం కాగానే లోకేశ్‌ మధ్యలో కూర్చొవటం పెద్దగా గుర్తించలేదు. కానీ. మీడియా కెమేరాలు.. పదే పదే అటువైపు ఫోకస్‌ చేయటంతో చుట్టూ ఉన్న వారంతా ఈ విషయాన్ని గుర్తించారు. ముఖ్యమంత్రి కుమారుడి హోదాతో పాటు.. పార్టీలో కీలకభూమిక పోషిస్తున్న లోకేశ్‌ వేదిక మీద కాకుండా.. వేదిక కిందన కార్యకర్తల మధ్యలో పాలు పంచుకోవటం..అధినేత చెప్పిన కొన్ని అంశాల్ని ప్రత్యేకంగా నమోదు చేసుకోవటం పలువుర్ని ఆకర్షించటమే కాదు.. చినబాబు ఎంత సింపులో అన్న కాంప్లిమెంట్‌ను లోకేశ్‌ సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News