గెలుపుపై ఓ మోస్తరు ధీమా ఉండటం సహజమే కానీ... మరీ అతి ధీమా పనికి రాదు. ఇలాంటి అతి ధీమా ఒక్కోసారి నవ్వుల పాల్జేస్తుంది కూడా. అందులోనూ రాజకీయ నేతలన్నాక కాస్తంత వివేకంతో నోరు విప్పాలన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసే కామెంట్లు సదరు నేతలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయని చెప్పాలి. అయినా ఇప్పుడేం జరిగిందని ఈ ప్రస్తావన అంటే... వచ్చే ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 స్థానాలను గెలిచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ఏపీ కేబినెట్ లో కీలక మంత్రి నారా లోకేశ్ చెప్పారు మరి.
ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పడంలో ఎంతమాత్రం తప్పు లేదు గానీ... ఏకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మొత్తంగా మొత్తం 175 స్థానాల్లోనూ విజయం సాధింస్తామని లోకేశ్ చెప్పడం ఇప్పుడు కాస్తంత ఎబ్బెట్టుగానే అనిపించక మానదు. తన మాట తీరుతో ఇప్పటికే ఎప్పటికప్పుడు తన మీద తనే సెటైర్లే వేయించుకుంటున్న లోకేశ్... ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మొత్తం అన్ని సీట్లలోనూ తమ పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పడం చూస్తుంటే... తనను తాను ఆయన మరోమారు బుక్ చేసుకున్నట్లేనని చెప్పక తప్పదు. అయినా
ఈ దిశగా లోకేశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయభేరి మోగిస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు సొంతం చేసుకుంటాం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కావున రాష్ట్ర ప్రజలంతా మావైపే ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ మొత్తం స్తానాల్లో గెలుస్తుంది* అని లోకేశ్ వ్యాఖ్యానించారు. మొత్తంగా మొత్తం సీట్లు గెలిచేస్తున్నామని చెప్పిన లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.