అప్ప‌ట్లో నాన్న‌కు సెంటిమెంట్ గుర్తుకు లేదా లోకేశ్‌?

Update: 2018-09-13 12:08 GMT
చిన‌బాబు ఎలా మాట్లాడ‌తారో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. త‌న మాట‌ల‌తో పార్టీని.. పార్టీ అధినేత క‌మ్ తండ్రికి ఇబ్బందికి గురి చేస్తూ.. తాను ఇబ్బందుల‌కు గుర‌వుతుంటారు. కాస్త గ‌ట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఆ ఇబ్బందిని అధిగ‌మించే వీలుంటుంది. కానీ.. దాని మీద దృష్టి పెట్ట‌రో ఏమో కానీ ఏపీ మంత్రి లోకేశ్ మ‌రోసారి త‌ప్పులో కాలేశారు.

తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని అధికార‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌.. లెక్క‌ల మీద లెక్క‌లు వేసుకొని.. నెల‌ల త‌ర‌బ‌డి ప్లానింగ్ చేసి మ‌రీ ముంద‌స్తుకు వెళ్లారు. ఢిల్లీలోని ప్ర‌ధాని మోడీ మొద‌లుకొని.. పార్టీలోని నేత‌ల్ని త‌న‌కు త‌గ్గ‌ట్లుగా మార్చుకున్న ఆయ‌న‌.. ప్ర‌జ‌ల నాడిని.. పార్టీ నేత‌ల తీరును స‌రిగా అర్థం చేసుకోలేదా? అన్న‌ట్లుంది తాజా ప‌రిణామాలు చూస్తుంటే.

అస‌మ్మ‌తి అన్న‌ది లేకుండా చేయ‌టం కోసం.. వివాదాల‌కు అవ‌కాశం ఉండ‌ద‌న్న ఉద్దేశంతో సిట్టింగుల‌కు పెద్ద‌పీట వేస్తూ.. ఇద్ద‌రికి త‌ప్పించి మిగిలిన టికెట్ల‌ను సిట్టింగుల‌కే ఇచ్చేశారు. కానీ.. కేసీఆర్ మీద అగ్గి గుగ్గిల‌మైపోతున్నారు. ఆగ‌మాగం చేస్తున్నారు. ఇలా టికెట్లు ఇస్తారా? అంటూ నిల‌దీస్తున్నారు. ఇలాంటి ప‌రిణామాలు చూసిన త‌ర్వాత ఎవ‌రైనా ముంద‌స్తుకు వెళ్లి.. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటారా? అన్న భావ‌న క‌లిగేలా చేశారు.

ఇలాంటివేళ‌.. లోకేశ్ బాబును ముంద‌స్తుకు వెళ‌తారా? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న స్పందించారు.  ఏపీ అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌నే లేద‌ని తేల్చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల మీద వ‌స్తున్న వార్త‌ల‌న్నీ త‌ప్పుడు ప్ర‌చారంగా కొట్టి పారేశారు. ప్ర‌స్తుతం త‌మ‌కు ఎన్నిక‌ల‌పై ఆలోచ‌న లేద‌న్నారు.

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై తాము దృష్టి పెట్టిన‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాన్ని ఐదేళ్లు న‌డ‌ప‌కుండా ముంద‌స్తుకు వెళ్ల‌టం స‌రికాద‌న్నారు. ఐదేళ్లు ప్ర‌భుత్వం ఉండాల‌న్న‌ది ప్ర‌జ‌ల సెంటిమెంట్ అని.. తాము ఆ విష‌యాన్ని గుర్తిస్తున్న‌ట్లు చెప్పారు. లోకేశ్ బాబు చెప్పిందంతా నిజ‌మే అనుకుందాం? మ‌రి.. 2004లో నాన్న ఎందుకు ముంద‌స్తుకు వెళ్లిన‌ట్లు?  అంటే.. అప్ప‌ట్లో నాన్న ప్ర‌జ‌ల సెంటిమెంట్ ను గుర్తించ‌లేద‌న్న మాట‌ను లోకేశ్ ఒప్పేసుకున్నట్లేనా?
Tags:    

Similar News