ఏపీలో ముందస్తు ఎన్నిక‌లుండ‌వు:లోకేష్

Update: 2018-09-15 14:03 GMT
 తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. 9 నెల‌లు మందుగానే అసెంబ్లీ ర‌ద్దు చేసిన కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా సీఎం చంద్ర‌బాబునాయుడు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోతున్నారంటూ ఓ జాతీయ న్యూస్ చానెల్ ఓ క‌థ‌నాన్ని వండి వార్చింది. మ‌రో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ ర‌ద్దు వంటి కీల‌కమైన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని ఆ క‌థ‌నం సారాంశం. ఈ క్ర‌మంలోనే ఆ క‌థ‌నాన్ని, ముంద‌స్తు పై వ‌స్తోన్న ఊహాగానాల‌ను ఏపీ మంత్రి లోకేష్ ఖండించారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఏపీలో ముంద‌స్తుకు వెళ్ల‌బోమ‌ని - పూర్తి 5 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌భుత్వం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ముందస్తుకు వెళ్ల‌వ‌ల‌సిన అవ‌స‌రం...తొంద‌ర టీడీపీకి లేవ‌ని లోకేష్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని లోకేష్ అన్నారు. అయితే, అటువంటి నిర్ణ‌యం ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎట్టిప‌రిస్థితుల్లోనూ తీసుకోవ‌ర‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు. మిగిలిన 9నెల‌ల ప‌ద‌వీకాలంలో తాము చేయాల్సిన ప్ర‌జాసంక్షేమ కార్య‌క్రమాలు చాలా ఉన్నాయ‌ని చెప్పారు. 2019లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌లకు మాత్ర‌మే తాము సిద్ధ‌మ‌వుతున్నామ‌ని చెప్పారు. అయితే, లోకేష్ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 2004లో చంద్ర‌బాబు ముంద‌స్తుకు వెళ్లిన‌పుడు లోకేష్ ఏం చేస్తున్నార‌ని....కామెంట్స్ పెడుతున్నారు.  నాడు చంద్ర‌బాబు త‌ర‌హాలో నేడు కేసీఆర్ ముంద‌స్తుకు వెళితే త‌ప్పేమిట‌ని....లోకేష్ అంత ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌ర‌మేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News