నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతున్న తరుణంలో పాలక టీడీపీలో రాజకీయాలు డైనమిక్ గా మారుతున్నాయి. ఇంతకాలం సీఎం తనయుడిగా - పార్టీ కీలక బాధ్యుడిగా మాత్రమే ఉంటూ పాలనలో జోక్యం చేసుకుంటూ వచ్చిన లోకేశ్ ఇప్పుడు మంత్రి కావడంతో టీడీపీ నేతలంతా ఆయన భజన మొదలుపెడుతున్నారు. కాబోయే సీఎం లోకేశేనంటూ పార్టీని - రాష్ర్టాన్ని ఆయన చేతిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కంటే కూడా లోకేశ్ కే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం - హోం మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి.
పంచాయతీ రాజ్ - ఐటీ - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని పదిహేను రోజులు కూడా కాకుండానే మిగతా మంత్రులు - సీనియర్ నేతల నుంచి అందరూ ఆయన ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నారు. చినరాజప్ప ఒక అడుగు ముందుకేసి కాబోయే సీఎం లోకేశేనంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పటికీ... ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారంటూ కితాబిచ్చారు. అన్ని అంశాలపై లోకేష్ కు పట్టు ఉందని... సమస్యలను పరిష్కరించే సత్తా ఉందని అన్నారు. అయతే.... లోకేశ్ మంత్రిగా ఇంత తక్కువ కాలంలో ఏం సాధించారని అడిగితే మాత్రం టీడీపీ నేతల వద్ద సమాధానం లేదు.
మరోవైపు లోకేశ్ కూడా పంచాయతీరాజ్ మంత్రి హోదాలో జిల్లాలను చుట్టిరావడం మొదలుపెట్టారు. మంత్రి హోదాలో జిల్లాలకు వెళ్లి నేతలందరినీ తన గ్రిప్ లోకి తెచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు. మంగళవారం తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన... పల్లెలను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే పంచాయితీ రాజ్ శాఖను తాను స్వీకరించినట్టు తెలిపారు.అయితే... పార్టీ విస్తరణ... క్షేత్ర స్థాయి నుంచి నేతలందరినీ తనవైపు తిప్పుకునే లక్ష్యంతో ఆయన సాగుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదంతా ఒకెత్తయితే.. కాబోయే సీఎం లోకేశే అని టీడీపీ నేతలంతా డిసైడైతే చంద్రబాబు ఫ్యూచరేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే బీజేపీ దూసుకెళ్తోంది. మోడీ నాయకత్వంలో బీజేపీ అన్ని రాష్ర్టాలనూ కమ్మేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ మోడీయే ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు వెళ్లడం కూడా అంత ఆషామాషీ ఏమీ కాదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏంటి... ఒకవేళ 2019లో మళ్లీ ఏదో రకంగా అధికారంలోకి రాగలిగితే కుర్చీని కుమారుడికి అప్పగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/