తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాప్రతినిధిగా చట్టసభల్లోకి ఎంట్రీ అయ్యేందుకు సర్వం సిద్ధమయింది. ఈ నెల 6వ తేదీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ వేయనున్నారు. తద్వారా ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారిగా లోకేష్ శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ దృష్టి పెట్టింది. ఈ నెల 7న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ పర్వం ముగియనుంది.
త్వరలోనే లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేష్ క్యాబినెట్ లో చేరడం ఖాయమైన నేపథ్యంలో ఎవరి మంత్రి పదవులకు ఎసరు పెట్టున్నారననే చర్చ జరగుతోంది. కొందరి మంత్రుల శాఖలను మార్చడం, మరికొందరికి ఉద్వాసన పలకడానికి సంబంధించి గత ఆరు నెలలుగా కసరత్తు జరుగుతోంది. దానికి తగినట్టుగానే గత కొంతకాలంగా తొలగించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తొలగించే జాబితాలో ఉన్న మంత్రుల శాఖలు ఇస్తారా లేకపోతే ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నవి ఇవ్వనున్నారా అనే సందేహం నెలకొంది. పరిశ్రమలు-వాణిజ్యం - సినిమాటోగ్రఫీ - మౌలిక సదుపాయాల కల్పన - న్యాయశాఖ - టూరిజం వంటి శాఖలన్నీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఉన్నాయి. వీటిలో నుంచి లోకేష్‌కు ఏదైనా శాఖ ఇస్తారా లేకపోతే తొలగించే మంత్రుల జాబితాలో నుంచి ఇవ్వనున్నారా అనే చర్చ ఇపుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కాగా, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సభ్యుల సంఖ్యా బలం బట్టి టీడీపీకి ఐదు - వైఎస్సార్ కాంగ్రెస్ కు రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఒకట్రెండురోజుల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. వైసీపీ ఖాతాలోకి వచ్చే రెండో స్థానాన్ని సైతం తమ ఖాతాలోకే జమ అయ్యేలా చేసుకునేందుకు తెలుగుదేశం వర్గాలు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/