టీడీపీలో అగ్రనాయకుడే పోటీకి భయపడి పారిపోతున్నాడా?

Update: 2019-02-19 07:47 GMT
ఇంతకీ నారా లోకేష్ బాబు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టా - లేదా అనేది ఆసక్తిదాయకమైన చర్చగా మారింది.  చంద్రబాబు రాజకీయ వారసుడు చాలా పేలవంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంత పేలవంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారు మరొకరు లేరు. మరీ నామినేటెడ్ పదవితో మంత్రి అయ్యాడు లోకేష్. ఈ విషయంలో నాలుగున్నరేళ్ల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే లోకేష్ మాత్రం అవేమీ వినపడనట్టుగా వ్యవహరిస్తున్నాడు.

ఇక మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. లోకేష్ ఈ సారి అయినా పోటీ చేస్తాడా.. అనేది సందేహంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం లేదు. దీంతో ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా.. అనే సందేహాలు నెలకొంటున్నాయి.

ఎమ్మెల్సీ హోదాల్లో ఉంటూ.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశాడు. ఎమ్మెల్సీగా ఉంటూ పోటీ చేస్తే. .సీరియస్ నెస్ ఉండదని సోమిరెడ్డి అలా రాజీనామా చేశాడని ప్రచారం చేసుకుంటున్నాడు. అలా అమీతుమీ తేల్చుకోవడానికి సోమిరెడ్డి రెడీ అవుతున్నాడు.

సోమిరెడ్డి వంటి నేతే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే సీటుకు పోటీ పడటం అంటే.. అలాంటిది లోకేష్ రాజీనామా చేయకపోతే ఎలా?

లోకేష్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలి. అయితే లోకేష్ లో మాత్రం ఆ తెగువ కనిపించడం లేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం లేదు. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న మరో  మాట.. లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు.. అనేది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. ఓటమి భయం లోకేష్ కు ఉందట. అందుకే ఈయన ఎమ్మెల్యేగానే బరిలోకి దిగడం లేదని సమాచారం.

ఎమ్మెల్సీగానే కొనసాగడానికి రెడీ అవుతున్నాడట. మరి ఇదే జరిగితే.. ఎన్నికల్లో పోటీకి భయపడి లోకేష్ పారిపోయినట్టుగా అవుతుంది.
Tags:    

Similar News