చంద్ర‌బాబు-లోకేష్‌...సేమ్‌ టు సేమ్‌

Update: 2016-01-06 12:36 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ కు గ‌ట్టి సవాలే ఎదురువుతోంది. తండ్రి బాట‌లోనే న‌డుస్తున్న లోకేష్‌ కు తెలుగుదేశం పార్టీ జాతీయ క‌మిటీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. పార్టీ నాయ‌కుడిగా చంద్ర‌బాబు ఎదుర్కున్న ప‌రీక్ష‌నే సేమ్ టు సేమ్ లోకేష్ త్వ‌ర‌లో ఫేస్ చేయ‌నున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి క‌న్వీన‌ర్‌ గా పార్టీలోకి తెరంగేట్రం చేసి లోకేష్ ఆ పద‌విలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని స్వీక‌రించారు. ఈ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత వస్తున్న మొట్ట‌మొద‌టి ఎన్నిక‌లు గ్రేట‌ర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ వి. ఈ ఎన్నిక‌లు తెలంగాణ‌లో టీడీపీ భ‌విష్య‌త్‌ ను నిర్దేశిస్తాయ‌నేది కాద‌న‌లేని నిజం. అయితే ఈ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను ఇప్ప‌టికే అన‌ధికారికంగా భుజాన వేసుకున్న లోకేష్ పార్టీ శ్రేణుల‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు-లోకేష్ తీసుకున్న బాధ్య‌త‌ల‌కు ద‌గ్గ‌రి పోలిక ఉంద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెప్తున్నారు.

చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు జరిగిన బల్దియా ఎన్నికల్లో ఆయనే మొత్తం సారథ్యం వహించారు. అప్పుడు ఉన్న మొత్తం వంద డివిజన్లలో పర్యటించారు. ఇంతే కాకుండా, స్థానిక నేతల ఇళ్ళలోనే సమావేశాలు ఏర్పాటుచేసి, అభ్యర్థులను ఖరారు చేశారు. అప్పట్లో కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్ర‌బాబు ప్రతి డివిజన్‌కు తిరగడంతో ఆయన సామర్థ్యాన్ని కార్యకర్తలు స్వయంగా గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆయన స్థానంలో తనయుడు లోకేష్ జీహెచ్ ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో అదే స్థాయిలో దృష్టి సారిస్తున్నారు.ఈనేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌చారం చేసి పార్టీని ఒడ్డున ప‌డేసిన‌ట్లే లోకేష్ కూడా అదే రీతిలో స‌త్తా చాటాల‌ని తెలుగుత‌మ్ముళ్లు ఆకాంక్షిస్తున్నారు.
Tags:    

Similar News