ప్రొడక్టు ఏదైనా లాంఛింగ్ అదిరేలా ఉండాలి. గ్రాండ్ గా ఓపెన్ అయ్యే వాటికి ఉండే మైలేజీ లెక్కలే వేరుగా ఉంటాయి. వస్తువుల విషయంలోనే అంతలా ఆలోచించినప్పుడు ఒక ముఖ్యమంత్రి తన కుమారుడ్ని ప్రజా జీవితంలోకి దింపి.. ప్రజాప్రతినిధిని చేయాలనుకున్నప్పుడు ఎవరి ఆప్షన్ అయినా నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేలా ప్లాన్ చేస్తుంటారు. రోటీన్ కు భిన్నమైన నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్న వేళలో.. వాతావరణం మొత్తం తనకు అనుకూలంగా ఉందని అనుకున్న వేళ.. తన రాజకీయ వారుసుడు కమ్ కుమారుడు నారా లోకేశ్ ను ప్రత్యక్ష పోటీ నుంచి కాకుండా పరోక్ష ఎన్నిక ద్వారా ఎమ్మెల్సీని చేసేసి.. మంత్రి పదవి కట్టబెట్టిన వైనంతో లోకేశ్ సమర్థత మీద సందేహాలు వ్యక్తమయ్యేలా.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ అయ్యేలా చేశారని చెబుతారు.
కాస్త ఆలస్యమైనా.. వేలు ఎత్తి చూపని రీతిలో తన రాజకీయ వారుసుడి లాంఛింగ్ ఉండాల్సిన స్థానే.. ఎమ్మెల్సీ పదవిని అప్పజెప్పి మంత్రిని చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వీటికి తాను సమాధానం ఇస్తానన్నట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలు కావటంతో ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. లోకేశ్ బలం చూశారుగా? అంటూ ఆయన్ను ఎక్కెసాలు చేసిన వారెందరో.
అప్పటి నుంచి ఆయన్ను దొడ్డిదారిన పదవులు చేపట్టి.. మంత్రి అయిన నేతగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన మీద వస్తున్న విమర్శల్ని స్వీకరిస్తూనే.. తన సత్తా చాటాలన్న కసితో లోకేశ్ ఉన్నారన్న మాట వినిపించేది. చావో రేవో.. ఈసారీ మంగళగిరి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో ఆయన ఉండేవారని చెప్పేవారు. ఈ వాదనకు తగ్గట్లే.. లోకేశ్ తాను మంగళగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పటమే కాదు.. ఆ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తుండేవారు. కానీ.. ఇటీవల కాలంలో ఆయన ఆలోచనల్లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈసారి ఎన్నికల్లో గెలుపు తప్పించి మరో ఆలోచనలు చేయొద్దని.. ప్రయోగాలు.. రిస్కులు అస్సలు అక్కర్లేదన్న మైండ్ సెట్ లోకి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే.. మంగళగిరి కాకుండా తనకు సేఫ్ గా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు మంగళగిరిని టార్గెట్ చేసిన అధికారపక్షం.. టీడీపీ నేతల్ని ఒక్కొక్కరిని తమ పార్టీలోకి తీసుకోవటంతో.. లోకేశ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
అందుకే.. మంగళగిరిని వదిలేసి.. వచ్చే ఎన్నికల్లో తనకు సూట్ అయ్యే నియోజకవర్గం ఏమిటి? అన్న దానిపై పెద్ద ఎత్తున సర్వేలు చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా కొన్ని నియోజకవర్గాల్నిఆప్షన్స్ గా ఇస్తూ.. వాటిల్లో గెలుపు అవకాశాలు పక్కా అన్న రిపోర్టు అందినట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు.. పెనుమలూరు.. విశాఖ సిటీలోని నియోజకవర్గాలు.. భీమిలీ.. హిందూపురంలో ఎక్కడి నుంచి పోటీచేసినా గెలుపు ఖాయమన్న మాటను చెప్పటంతో లోకేశ్ పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు.
అవసరమైతే.. మామ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని తనకు ఇచ్చేసి.. ఆయన్నులోక్ సభ బరిలో దిగాలన్న మాట చెబితే తాను ఎమ్మెల్యే కావటం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఇలాంటి ప్రచారంతో లోకేశ్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా అధికార పార్టీ వ్యూహరచన చేస్తుందన్న ఆరోపణ వినిపిస్తోంది. మరి ఈ తరహా ప్రచారంపై లోకేశ్ ఎలా రియాక్టు అవుతారోచూడాలి. తాను బరిలో దిగే నియోజకవర్గం మార్పు అంశం నిజమా? అన్నది తేలాలంటే మాత్రం కాస్త వెయిట్ చేయక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.