వారసత్వ రాజకీయాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ నాయకుల కుమారులు రాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని సమర్థించుకున్నారు. తిరుపతి చదలవాడ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో భాగంగా అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయకుండా వారసత్వ రాజకీయాలవైపు మీ ప్రయాణం సాగుతూ ఉందా అన్న ప్రశ్నకు ఒక కుటుంబంలో ఒక డాక్టర్ ఉన్నా - లాయర్ ఉన్నా వారి పిల్లలుకూడా అటువైపే నడుస్తారన్నారు. ఎందుకంటే ఆ వృత్తికి సంబంధించిన అంశాలపై వారి కుటుంబంలో తరచూ చర్చలు జరుపుతూ ఉండడంతో పిల్లలు కూడా అటువైపు మొగ్గుచూపుతారన్నారు. తన తాత ఎన్ టిఆర్ - తన తండ్రి చంద్రబాబునాయుడుల స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చారన్నారు.ప్రతి మనిషిలోను బలాలు - బలహీనతలు ఉంటాయని అందులో మంచి వాటిని స్వీకరించి ఎదగడమే యువత నేర్చుకోవాలని లోకేష్ చెప్పారు.
ఎన్ని విమర్శలొచ్చినా ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దుచేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తన దమ్మును చాటుకున్నాడని, అదే తరహాలో రిజర్వేషన్లను రద్దుచేసి ఓసిలో ఉన్నత చదువులు చదువుకున్నవారికి మీరు చేయూత నిస్తారా?, రిజర్వేషన్ ఓటు రాజకీయాలు అనే మాటను మీరు సీఎం అయితే మారుస్తారా? - పార్లమెంటులో రిజర్వేషన్ రద్దుపై బిల్లువస్తే సమర్థిస్తారా? అని విద్యార్థులు ప్రధానంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని, ఆవేశంగా దీనిపై ఏదో మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై విస్తృతంగా చర్చ జరిగి అందరి మద్దతు పొందాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆర్థికంగా వెనుబకడిన అన్ని కులాలలోని నిరుపేదలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని లోకేష్ సమాధానమిచ్చారు. కులాలకు అతీతంగా - ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతీ యువకులకు ఉద్యోగ - ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి గోపి మాట్లాడుతూ కుల ప్రాతిపదిక రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి తేల్చి చెప్పాలన్నారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ కుల ప్రాతిపదిక రిజర్వేషన్లపై ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ సమాధానం దాటవేశారు. కులం - ప్రాంతం పేరిట కొంతమంది విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వారి విషయంలో యువత అప్రమత్తంగా ఉంటూ కుల రాజకీయాల జోలికి వెళ్లొద్దని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్, కాపు నాయకుడు ముద్రగడపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కీలక అంశాలపై ఆయనను సూటిగా ప్రశ్నించారు. ఒక దశలో కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు - వారసత్వ రాజకీయాలు - నిరుద్యోగభృతి - అగ్రి గోల్డ్ వ్యవహారం - మద్యం బెల్టు షాపులు అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం దాటవేసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/