మ‌ళ్లీ త‌డ‌బ‌డ్డ లోకేష్‌...ఈసారి అసెంబ్లీలో

Update: 2018-04-03 06:33 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మరోసారి తడబడ్డారు. అసెంబ్లీలో గ్రామీణ మంచినీటి పథకాలపై లఘు చర్చ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఆయన వివరించారు. చివరగా తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ‘నాపై వచ్చిన ఆరోపణలలో అవాస్తవాలు లేకపోయినా బురదజల్లుతున్నారు’ అని చెప్పటంతో కొందరు ఎమ్మెల్యేలు అర్థంకాక విస్తుపోయారు. దీంతో లోకేష్ వెంటనే తేరుకుని ఆరోపణలలో వాస్తవాలు ఉంటే ప్రజల మధ్య చర్చిద్దామని సరిచేసుకున్నారు. కాగా గిరిజన ప్రాంతాల్లో మంచినీటి సరఫరా విషయమై మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో అనే పదాన్ని ఐటీపీఏ అని చదువుతుండగా పక్కనున్న ఎమ్మెల్యేలు సవరించారు.

చిన్న వయస్సులో మంత్రి కావటం అదృష్టంగా బావిస్తున్నట్లు మంత్రి నారాలోకేష్‌ అన్నారు. తాను ఏరోజూ లాలూచీ పడలేదని - హెరిటేజ్‌ ని అమ్మ - బ్రాహ్మణీ అద్భుతంగా నడిపిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సూపర్‌ సీనియర్లు ఉన్నారని, వాళ్లు సలహాలు - సూచనలు ఇస్తున్నారని చెప్పారు. అందరి సహకారం కావాలని - లేని పోని ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. 75సంవత్సరాల స్వతంత్య్ర దేశంలో ఇంకా తాగునీటి సమస్య ఉండటం బాధాకరమన్నారు. మనిషి పుట్టిన దగ్గర నుండి అంతిమ యాత్ర వరకు నీరు అవసరమని - రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై పెట్టారని లోకేష్ అన్నారు. దీనిలో భాగంగానే మార్చి-2019నాటికి కలుషిత తాగునీరు లేని విధంగా, మార్చి-2020నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News