వరుస ఆహ్వానాలు.. ఒకరింటికి మరొకరు వెళ్లటం.. ముచ్చట్లు చెప్పుకోవటం.. విందుల్లోనూ విడిగా భేటీ కావటం లాంటి ఘటనలతో ఇద్దరు చంద్రుళ్ల మధ్య సామరస్య ధోరణి పుణ్యమా అని రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణాన్ని కూల్ చేసిన వైనం తెలిసిందే. చంద్రుళ్లకు తగ్గట్లే వారి అనుచరగణం సైతం బుద్దిగా ఉంటూ ఆచితూచి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి.
ఇక.. అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలు కానున్న సంకేతం తాజాగా వెలువడింది. అయితే.. ఈసారి తొలుత విమర్శ చేసింది టీడీపీ జాతీయ కార్యదర్శి.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబే కావటం గమనార్హం. తాజాగా ఈ ఉదయం ట్వీట్ చేసిన లోకేశ్.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షం అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు. ట్విట్టర్ లో ట్వీట్ చేసిన లోకేశ్.. టీఆర్ ఎస్ ది ద్వంద విధానమని.. సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టేందుకు టీఆర్ ఎస్ ప్రయత్నిస్తుందన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్ల కోసం వారు చేస్తున్న సానుకూల వ్యాఖ్యలు.. మొసలి కన్నీరు కార్చటంలాంటవన్నీ గ్రేటర్ నేపథ్యంలోనే అంటూ లోకేశ్ విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా చినబాబు చేసిన ట్విట్ పుణ్యమా అని రెండు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం షురూ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.