ఇక‌.. చిన‌బాబు గుంటూరు మ‌కాం

Update: 2015-07-13 04:38 GMT
విభ‌జ‌న జ‌రిగి పోయిన త‌ర్వాత కూడా హైద‌రాబాద్‌ను వ‌దిలిపెట్ట‌రే అంటూ తెలంగాణ అధికార‌ప‌క్షం ఈస‌డించుకున్నా.. పెద్ద‌గా ఫీల్  కాకుండా.. గ‌త ప‌ద‌మూడు నెల‌లుగా తెలుగు త‌మ్ముళ్లు హైద‌రాబాద్ నుంచే వ్య‌వ‌హారాలు న‌డిపించ‌టం తెలిసిందే.

అయితే.. తెలంగాణ అధికార‌ప‌క్షం వారి ఈస‌డింపుల సంగ‌తి ఎలా ఉన్నా.. ఇదే విష‌యంపై సీమాంధ్రులు ఏమ‌నుకుంటున్నార‌న్న దానిపై త‌మ్ముళ్లు దృష్టి సారిస్తే.. వారికి షాకింగ్ విష‌యాలు తెలిసాయంట‌. చేతికి అధికారం ఇచ్చిన త‌ర్వాత కూడా ఇంకా మాయ‌దారి హైద‌రాబాద్ వ‌దిలిపెట్టి రారా? అంటూ జ‌నం తిట్టిపోస్తున్న విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ అగ్ర‌నేత‌లు కాస్త ఆల‌స్యంగా గుర్తించినట్లుగా చెబుతున్నారు.

చేతికి అధికారం ఇచ్చి.. త‌మ‌నుబాగు చేయాల‌ని.. ఏపీని అభివృద్ధి చేయాల‌ని.. నిత్యం ఏపీ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ.. పార్టీని.. ప్ర‌జ‌ల సంగ‌తిని ప‌ట్టించుకోవాల్సింది పోయి.. హైద‌రాబాద్‌.. హైదరాబాద్ అంటూ క‌ల‌వ‌రించ‌టంపై ఏపీ ప్ర‌జ‌లు కోపంగా ఉన్న విష‌యాన్ని టీడీపీ గుర్తించిన‌ట్లు చెబుతున్నారు.
అందుకే.. ఏపీలో త‌న మ‌కాం గురించి ఈ మ‌ధ్య త‌ర‌చూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌స్తావిస్తున్నారు. తాజాగా.. చంద్ర‌బాబు కుమారుడు.. పార్టీ నేత‌లంతా ముద్దుగా పిలుచుకునే చిన‌బాబు కూడా త‌న మ‌కాంను హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు మార్చాల‌ని డిసైడ్ అయ్యారు.

వారంలో మూడు రోజులు క‌చ్ఛితంగా గుంటూరులోనే ఉండాల‌ని లోకేశ్ నిర్ణ‌యించుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లు తీరును ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించ‌టంతో పాటు.. పార్టీ నేత‌లు..  కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండేందుకు గుంటూరు క‌రెక్ట్ గా ఉంటుంద‌ని లోకేశ్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.
వారంలో మూడు రోజుల బ‌సను మంగ‌ళ‌వారం నుంచి షురూ చేస్తార‌ని చెబుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరులోని పార్టీ కార్య‌ల‌యాన్ని సంద‌ర్శిస్తార‌ని చెబుతున్నారు. మొత్తానికి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉన్న ప‌ని మొద‌లుపెట్ట‌టానికి టీడీపీ అగ్ర‌నేత‌ల‌కు ప‌ద‌మూడు నెల‌లు ప‌ట్టింది.
Tags:    

Similar News