మాస్ మాటలు మాట్లాడాలన్నా...గాంధీ జయంతి రోజున చికెన్ తినాలన్నా అది సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణకే సొంతం. ఆయనకు ఎప్పుడు కాస్త తిక్కరేగుతుందో తెలియదు కాని వివాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేస్తారు. తాజాగా తిరుపతిలో ఏఐఎస్ ఎఫ్ 80వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిని తూర్పారపట్టిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో మోదీ కనుసైగ చేసిన వెంటనే కేంద్ర మంత్రి వెంకయ్య నరాలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ పెదవుల్లా కదులుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్మోదీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఎవరైనా ర్యాగింగ్ చేస్తే కఠినంగా శిక్షించాలని సూచించిన ఆయన యువతీ,యువకుతు పార్కుల్లో కూర్చుని మాట్లాడుకోవాలని..వారు ఈ వయస్సులో కాకపోతే ఇంకెప్పుడు ఊసులాడుకుంటారని చమత్కారంగా మాట్లాడారు.