భూముల ధరలు పడిపోవటమేమిటి నారాయణ?

Update: 2015-04-14 10:42 GMT
ఏపీ రాజధాని ప్రాంతంలోభూముల ధరలు ఏ రేంజ్‌లో దూసుకెళుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ రాజధానిగా తుళ్లూరు పరిసర ప్రాంతాల్ని ఎంపిక చేసిన నేపథ్యంలో ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.2.5కోట్ల వరకూ దూసుకెళ్లటం తెలిసిందే.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏపీ సర్కారు భారీ ఎత్తున భూములు సమీకరించిన విషయం తెలిసిందే. భూములు సమీకరించే నేపథ్యంలో భూ యజమానులకు భారీ ప్యాకేజీని ఏపీ సర్కారు ప్రకటించింది. ఏపీ రాజధాని ప్రాంతంలోని భూములకు మొదట్లో ఉన్నంత బూమ్‌ లేనప్పటికీ.. మరీ దారుణంగా అయితే పడిపోవటం లేదు. అయితే.. దీనికి విరుద్ధంగా ఏపీ మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ప్రతిపక్షాల ఆరోపణల కారణంగా ఏపీ రాజధానిలో పొలాల రేట్ల ధరలు ఎకరానికి రోజుకు రూ.10లక్షల చొప్పున తగ్గిపోతున్నాయని చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాంతంలో ఉన్న పోలాలను అమ్ముకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఎవరికి ఉండవని వెల్లడించారు.

విపక్షాల చేస్తున్న ఆరోపణలు.. విమర్శల కారణంగా రోజుకు రూ.10లక్షల చొప్పున ధర పడిపోతుందన్న నారాయణ మాటలు కాసేపు నిజమే అనుకంఉటే.. ఇరవై రోఉలు ఆగితే భూమి ధర ఏమీ ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి నారాయణ సారు ఏం సమాధానం ఇస్తారో..?

Tags:    

Similar News