తెలంగాణలోని నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఇద్దరు పటేళ్లు టికెట్ల కోసం హోరాహోరీ తలపడుతున్నారు. రామారావు పటేల్ - నారాయణ రావ్ పటేల్ ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. నిజానికి వీరిద్దరు అన్నాదమ్ములే. ఒకే రక్తసంబంధీకులే. అయినా ఈ సోదరుల మధ్య పోరాటంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
నారాయణ రావు పటేల్ టీడీపీ టికెట్ పై గడిచిన ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం సీఎం కేసీఆర్ అధికారం చేపట్టడంతో గులాబీ పార్టీలో చేరిపోయారు. ఈయన సోదరుడు రామారావు పటేల్ కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగుతూ పార్టీని నియోజకవర్గంలో పటిష్టం చేశారు. తాజాగా కేసీఆర్ ముథోల్ నుంచి నారాయణ రావు పటేల్ కు టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇద్దరు సోదరులు కాంగ్రెస్ లోనే ఉండడంతో విభేదాలు, టికెట్ రేసు మొదలైంది. రామారావు పటేల్ ఆదినుంచి కాంగ్రెస్ పార్టీతో ఉండి పనిచేయగా.. కొత్తగా టీఆర్ ఎస్ నుంచి వచ్చిన నారాయణరావ్ పటేల్ టికెట్ కోసం హోరా హోరీ ప్రయత్నాలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆకర్షిస్తున్నారు. ఇటీవల రాహుల్ సభ కోసం జనాలను సమీకరించడంలో ఇద్దరూ పటేళ్లు తీవ్రంగా కృషి చేసి అధిష్టానాన్ని ఆకర్షించారు. దీంతో కాంగ్రెస్ లో టికెట్ ఎవరికి దక్కుతుందనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది.
రామారావుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు - డీసీసీ మద్దతు ఉంది. కానీ నారాయణ రావుకు టీపీసీసీ నేతల మద్దతుందని చెబుతున్నారు. ఇద్దరు నేతలు టికెట్లు ఆశిస్తూ పోటీపోటీగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పై స్థానికంగా కొంత వ్యతిరేకత, పనిచేయని నేతగా విమర్శలున్నాయి. రామారావు పటేల్ పార్టీ కోసం పనిచేసి కార్యకర్తలతో సత్సంబంధాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు పటేళ్లలో టికెట్స్ ఎవరికి వస్తాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.