జ‌ర్న‌లిస్ట్‌ ల ప్రాణాలు కాపాడిన మోడీ

Update: 2016-08-30 14:16 GMT
ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీలోని మ‌రో కోణం ఇది. కీల‌క సంద‌ర్భంలో ఉన్న‌ప్ప‌టికీ, అంతా త‌మ త‌మ ప‌నుల్లో బిజీగా ఉన్న స‌మ‌యంలో కూడా ప్ర‌ధాన‌మంత్రి స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డంతో ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. గుజ‌రాత్ ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్ వెల్ల‌డించిన ఈ విష‌యం ఇపుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌ధానికి హ్యాట్సాఫ్ చెప్పేందుకు కార‌ణం అవుతోంది.

సొంత రాష్ట్రం  గుజ‌రాత్ పర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఓ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించారు. జామ్‌ న‌గ‌ర్‌ లో  నొక్కి డ్యామ్ నుంచి నీటిని విడుద‌ల చేసిన త‌ర్వాత అక్క‌డి ప్ర‌కృతిని చూస్తూ మోడీ అలాగే నిల్చుండిపోయారు.  అయితే అప్ప‌టికే డ్యామ్‌ కి కాస్త దూరంలో కింద నిల‌బ‌డి ప్ర‌ధాన‌మంత్రి  ఫొటోలు తీయ‌డంలో బిజీగా ఉన్న జ‌ర్న‌లిస్ట్‌ లు వేగంగా వ‌స్తున్న నీటి ప్ర‌వాహాన్ని గ‌మ‌నించ‌లేదు. అయితే అటు వ‌ర‌ద‌ను - ఇటు ఫొటోగ్రాఫ‌ర్ల‌ను గ‌మ‌నించిన ప్ర‌ధాన‌మంత్రి ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయ్యారు. స్వ‌యంగా చ‌ప్ప‌ట్లు కొడుతూ - చేతులు ఊపుతూ జ‌ర్న‌లిస్టుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. దీంతో ప్ర‌ధాన‌మంత్రి హెచ్చ‌రిక‌ల‌ను గ‌మ‌నించిన పాత్రికేయ మిత్రులు అక్క‌డి నుంచి త‌ప్పుకున్నారు. ప్ర‌ధాని స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని నితిన్ ప‌టేల్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. మ‌రోవైపు త‌మ ప్రాణాల‌ను కాపాడిన ప్ర‌ధాన‌మంత్రికి జ‌ర్న‌లిస్ట్‌ లు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
Tags:    

Similar News