నవాజ్ ను మోడీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారట

Update: 2016-12-25 07:05 GMT
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను మోడీ తన మాయాజాలంలో పిచ్చెక్కిస్తున్నారు. షరీఫ్ తన హయాంలో పలువురు భారతీయ ప్రధానులను చూసినా ఎవరూ ఆయన్ను ఈ స్థాయిలో కన్ఫ్యూజ్ చేయలేదట. మోడీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియక... దేనికెలా స్పందించాలో అర్థం కాక షరీఫ్ తెగ ఇబ్బంది పడుతున్నారట.  గత ఏడాది కాలంలో జరిగిన పరిణామాలన్నీ మననం చేసుకుంటే మోడీ నిజంగానే షరీఫ్ కు పిచ్చెక్కిస్తున్నారని అర్థమవుతోంది.  
    
ఉప్పు నిప్పులా ఉన్న పాక్ - భారత్ ల మధ్య పొరపొచ్చాలన్నీ పక్కనబెట్టి గత ఏడాది ఇదే రోజున మోడీ లాహోర్ లో హఠాత్తుగా ల్యాండయి షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మంచి బహుమతులూ ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయన పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. ఉరి అటాక్ తరువాత పాక్ పై సర్జికల్ స్రయిక్స్ చేసి దెబ్బ కొట్టారు. అంతేకాదు... అంతర్జాతీయంగా పాక్ ను ఒంటరి చేయడంలో కొంతవరకు సఫలమయ్యారు. అక్కడితో ఆగకుండా సింధు జలాలను పాక్ కు ఇవ్వబోమని బెదిరించారు. ఇంత చేశాక షరీప్ మళ్లీ ఎదురుపడినా కూడా మోడీ ముఖం చిట్లించుకుని వెళ్లిపోతారని అనుకుంటారు ఎవరైనా.. కానీ, ఆయన మోడీ. మిగతా పొలిటీషియన్ల కంటే చాలా డిఫరెంటు పర్సనాలిటీ. షరీఫ్ కు ఆయన ఎదురుపడలేదు కానీ... ఎవరూ ఊహించని రీతిలో ఈ ఏడాది కూడా షరీఫ్ బర్త్ డే సందర్భంగా గ్రీటింగ్సు చెప్పారాయన.
    
ఈ ఏడాదంతా నెలకొన్న ఉద్రిక్తతలను పక్కనపెట్టి మరీ స్నేహ హస్తాన్ని అందించే ప్రయత్నం చేశారు.  తన ట్విట్టర్ ఖాతాద్వారా "పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News