ఎట‌కారం ఎంత చేసినా బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌టం మ‌ర‌వ‌ని మోడీ

Update: 2019-06-19 05:45 GMT
త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ప్ర‌ధాని మోడీ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. తెలుగు రాజ‌కీయాలు చూస్తే.. మాట తేడా వ‌స్తే విష్ చేసుకోవటం త‌ర్వాత ముఖం.. ముఖం చూసుకోవ‌టం కూడా ఉండ‌దు. ఎడ‌ముఖం.. పెడ ముఖం అన్న‌ట్లుగా ఉంటారు. కానీ.. జాతీయ రాజ‌కీయాలు మాత్రం అందుకు భిన్నం.

చాలా కొద్ది మంది మిన‌హా మిగిలిన వారు రాజ‌కీయంగా శ‌త్రుత్వం వేరు.. వ్య‌క్తిగ‌త సంబంధాలు వేరు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. రాజ‌కీయంగా ఎంత తొక్కాలో అంత‌గా తొక్కుతూనే.. త‌న ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో మాత్రం కొన్ని విష‌యాల్లో భ‌లేగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు ప్ర‌ధాని మోడీ. తాజా ఉదంతాన్నే తీసుకుంటే.. ఈ రోజు రాహుల్ గాంధీ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు మోడీ.

విడి రోజుల్లో రాహుల్ ను ఎంత ఎట‌కారం చేసినా.. పుట్టిన రోజు విష‌యంలో మాత్రం త‌ర‌త‌మ భేదం పాటించ‌కుండా గ్రీటింగ్స్ చెప్పేసి జాతి జ‌నుల మ‌నసుల్ని గెలిచేస్తుంటారు మోడీ. రాహుల్ గాంధీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.. రాహుల్ కు మంచి ఆరోగ్యంతో పాటు సుదీర్ఘ జీవితం ల‌భించాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా మోడీ ట్వీట్ చేశారు.

గ‌తంలో చంద్ర‌బాబుతో స‌హా.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు త‌ప్ప‌నిస‌రిగా బ‌ర్త్ డే విషెస్ ను ట్వీట్ ద్వారా..త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న వారికి మాత్రం ఫోన్ ద్వారా శుభాకాంక్ష‌లు చెప్పేయ‌టం మోడీలో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News