ఉప్పు నిప్పులా ఉండే ఇరువురు రాజకీయ నేతల్లో ఒకరిని మరొకరు ఫాలో కావటం సాధ్యమేనా?అంటే.. రాజకీయాల గురించి తెలిసిన వారెవరూ నో అని చెప్పేస్తారు. కానీ.. టెక్నాలజీ గురించి అవగాహన ఉండి.. రాజకీయాలు తెలిసిన వారు మాత్రం సాధ్యమేనని చెబుతారు. సైద్ధాంతికంగా బద్ధ విరోదుల మాదిరి వ్యవహరించే ప్రధాని నరేంద్రమోడీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు.. రాజకీయంగా ఒకరంటే ఒకరికి అస్సలు పడదు.
అదే సమయంలో.. అనారోగ్యంతో బాధ పడుతున్న కేజ్రీవాల్ కు సరైన డాక్టర్ గురించి చెప్పటమే కాదు.. ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పటం కనిపిస్తుంది. ఇలా ఇద్దరి మధ్యన రాజకీయంగా ఉండే దూరం.. వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో ఒకరికొకరు కాస్త దగ్గరగా ఉన్నట్లే కనిపిస్తారు. తాజాగా అలాంటిదే ఒకటి చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మోడీ.. కేజ్రీవాల్ ఇద్దరూ ఎవరికి వారుగా ఉంటారు. అలాంటిది ప్రధాని మోడీ.. ఢిల్లీ సీఎంను ఫాలో కావటం.. ఆ విషయాన్ని కేజ్రీవాల్ వెల్లడిస్తూ.. తనను ఫాలో కావటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి తనను ఫాలో కావటం పట్ల కేజ్రీవాల్ ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పటం గమనార్హం.