2014లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ తరఫున ప్రధానమంత్రయిన నరేంద్ర మోదీ తన అయిదేళ్ల పదవీ కాలంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రజలను - రాజకీయ నాయకులను కూడా ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా నోట్ల రద్దు - జీఎస్టీ అమలు వంటివి సంచలనం సృష్టించాయి. వీటితో పాటు ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం - నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ - వన్ ర్యాంక్ వన్ పెన్సన్ వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వీటిలో జీఎస్టీ - నోట్ల రద్దుపై విపక్షాలు గోలగోల చేశాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేశాయి. కానీ.. ప్రజలు మాత్రం మోదీకి రెండోసారి మరింత మెజారిటీ కట్టబెట్టారు.
రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ తొలి ఆర్నెళ్లలోనే కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. వీటిలో కొన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయని.. మొదటి ఆర్నెళ్లలో వీలు కానిపక్షంలో తొలి ఏడాదిలో ఈ నిర్ణయాలు అమల్లోకి రావడం ఖాయమని బీజేపీలోని కీలక వ్యక్తుల నుంచే వినిపిస్తోంది.
మోదీ తీసుకునే సంచలన నిర్ణయాలు ఇవే..
1) ఇద్దరు పిల్లలే హద్దు
దేశ జనాభా శరవేగంతో పెరుగుతుండడంతో మోదీ జనాభా నియంత్రణపై కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో సగటు బర్త్ రేట్ 2.33 ఉంది. అంటే సగటున ప్రతి వివాహిత ఇద్దరు కంటే ఎక్కువ మందిని కంటున్నట్లు లెక్క. ఇది అమెరికాలో 1.8 - చైనాలో 1.62 ఉంది. ఇండియాలో జననాల రేటు ఇలాగే కొనసాగితే 2024 సరికి భారత జనాభా చైనాను దాటిపోతుంది. జనాభా పెరుగుదల భారత్ ను సమస్యల్లోకి నెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఇకపై ఎవరూ ఇద్దరు కంటే ఎక్కువ మందిని కనకుండా చట్టం తేనున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈచట్టాన్ని అతిక్రమిస్తే వారికి ప్రభుత్వ రాయితీలు - పథకాలు ఏవీ వర్తించవు.
2) ఆర్టికల్ 35ఏ రద్దు
జమ్ముకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 35-ఏ ను మోదీ రద్దు చేస్తారని తెలుస్తోంది.
పంజాబ్ నుంచి ప్రవాహంలా వస్తున్న వలసలను అడ్డుకునే క్రమంలో 1927లో అప్పటి జమ్ముకశ్మీర్ సంస్థానం మహారాజు హరిసింగ్ తొలిసారి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులకు సంబంధించి అందులో కొన్ని సూత్రాలు పొందుపరచుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిరపడడాన్ని నియంత్రిస్తూ చట్టంలో నిబంధనలున్నాయి.అనంతరం 1947లో జమ్ముకశ్మీర్ సంస్థానం భారత్ లో విలీనమైంది. ఆ తరువాత అక్కడ షేక్ అబ్దుల్లా అధికారం చేపట్టారు. 1949లో జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. ఇది జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం - జెండా కలిగి ఉండే వీలు కల్పిస్తుంది. ఆర్టికల్ 370 కేంద్రం శాసనాధికారాలను జమ్ముకశ్మీర్ లో కేవలం రక్షణ - విదేశీ వ్యవహారాలు - సమాచార ప్రసారాల వరకే పరిమితం చేస్తుంది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35-ఎను రాజ్యాంగంలో చేర్చారు. ఇది ఇంతవరకు పార్లమెంటు ఆమోదాన్ని పొందలేదు. నెహ్రూ ప్రభుత్వం దొడ్డిదారిన ప్రవేశపెట్టిన ఈ ఆర్టికల్ జమ్ముకశ్మీర్ ప్రజలను మిగతా దేశంతో వేరు చేస్తుంది. జమ్ముకశ్మీర్ లో శాశ్వత నివాసులు మాత్రమే అక్కడ స్థిరాస్తులు కొనడం - స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనే అవకాశమిచ్చే ఆర్టికల్ ఇది. అంతేకాదు.. జమ్ముకశ్మీర్‌లో శాశ్వత నివాస హోదా ఉన్న మహిళలు అలాంటి హోదా లేని బయటవారిని వివాహమాడితే అప్పటి నుంచి ఆ మహిళలు - వారి సంతానం ఆ హోదా కోల్పోతారు. ఇన్ని వివాదాలుండడంతో దీన్ని రద్దు చేయాలని మోదీ తలపోస్తున్నారు.
3) నేషనల్ రిజిష్టర్ - సిటిజన్ షిప్ బిల్లులో పశ్చిమబెంగాల్ లో అమలు
ఇప్పటికే అస్సాంలో అమలైన నేషనల్ రిజిష్టర్ - సిటిజన్ షిప్ బిల్లులను ఇప్పుడు పశ్చిమబెంగాల్ లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత క్రమంగా ఎన్డీయే పాలనలోని మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తారు.
4) ప్రభుత్వ - ప్రయివేటు ఉద్యోగావకాశాలు.. నిరుద్యోగులు అంతా ఒకే చోట
ప్రభుత్వ - ప్రయివేటు ఉద్యోగవకాశాల ప్రకటన.. నిరుద్యోగుల డాటా అంతా ఒకే చోట ఉంటూ అవకాశాలు స్పష్టంగా తెలిసేలా.. కొత్త ఉద్యోగాలు సృష్టించేలా - వీలైనంత మందికి అవకాశాలు దొరికేలా ఒక కొత్త వ్యవస్థ తేనున్నట్లు తెలుస్తోంది.
5) పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ స్వాతంత్ర్యానికి సాయం
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతం చాలాకాలంగా వేరుపడేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ప్రాంత ప్రజల స్వాతంత్ర్య పోరాటానికి మద్దతిచ్చి పాక్‌ను రెండు దేశాలు చేసేందుకు బలూచ్ నాయకులకు మోదీ ప్రభుత్వం సాయం చేసే అవకాశాలున్నాయి. ఇది ఆ ప్రాంతంలో గ్వాదర్ వంటి పోర్టులు కడుతున్న చైనాను కూడా కలవరపెట్టే అంశం. దీనికోసం అమెరికా - రష్యా వంటి దేశాల నుంచి సానుకూలత సాధించేందుకు మోదీ ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్.