మోడీ విదేశీ టూర్ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది

Update: 2017-04-06 05:16 GMT
ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ టూర్ల గురించి కొత్త వార్త ఇది. ప్ర‌ధానిగా బాధ్యతలు స్వీకరించడ‌మే త‌రువాయి విదేశాల్లో చ‌క్క‌ర్లు కొట్టిన మోడీజీ ఆ త‌ర్వాత భారీ స్థాయిలో చెక్క‌ర్లు కొట్టిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ప్ర‌ధాని ప‌ద‌వి అనంత‌రం నవంబరు, 2016 వరకు 56 విదేశీ పర్యటనలు చేశారు. నాలుగుసార్లు అమెరికాలో పర్యటించగా, చైనా - జపాన్ - రష్యా - నేపా ల్ తదితర దేశాల్లో రెండుసార్లు చొప్పున పర్యటించా రు.

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకేసింగ్ లోక్‌ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మోడీ విదేశీ టూర్ల వివ‌రాల‌ను వెల్లడించారు. ప్రధానిగా 2014 మే 26వ తేదీన బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూన్ 15-16 తేదీల్లో భూటాన్‌ తో తన విదేశీ పర్యటను ప్రారంభించారు. ఆ తర్వాత నెల రోజులకు బ్రెజిల్‌ లో బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యారు. చివరిసారిగా గతేడాది నవంబరు 10-12 తేదీల్లో జపాన్‌ లో పర్యటించారు. 2015 డిసెంబరు 25న షెడ్యూలులో లేకపోయిననా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు ప్రధాని హాజరయ్యారు. స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు చైనాలో - రష్యాలో రెండుసార్లు పర్యటించారు. అమెరికాలో నాలుగుసార్లు పర్యటన జరిపిన మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కావడంతో పాటు అమెరికాకు చెందిన చెందిన యాపిల్ - గూగుల్ - ఫేస్‌ బుక్ - మైక్రోసాఫ్ట్ - సిస్కో - అడోబ్ తదితర 500 సంస్థల సీఈఓలతో భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News