నైతిక‌త‌ను న‌రికేసి పాతి పెట్టిన మోడీ!

Update: 2019-02-02 05:22 GMT
రాజ‌కీయాలంటేనే అదో రొచ్చు. అలాంటి వాటిల్లో విలువ‌ల్ని ఆశించ‌ట‌మా?  నో.. నెవ్వ‌ర్ అన్న‌ట్లుగా మాట్లాడే వారికి ద‌న్నుగా నిలిచేలా మోడీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించింది. విలువ‌ల వ‌లువ‌లు విప్ప‌దీయ‌టం మోడీ మాష్టారికి కొత్త విష‌య‌మేమీ కాదు. రాష్ట్రాల్లో ఏ రీతిలో అయితే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే ముఖ్య‌మంత్రులు వ‌చ్చేశారో.. ఇప్పుడు దేశ ప్ర‌ధాని సైతం అదే త‌రహాలో వ్య‌వ‌హ‌రించ‌టం ఈ జాతి చేసుకున్న దుర‌దృష్టంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

రాష్ట్రాల్లో నైతిక‌త లాంటి  వాటికి ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా.. త‌మ‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరును చూస్తుండేదే. తాజాగా మోడీ స‌ర్కారు అదే తీరును బ‌డ్జెట్ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించి.. కోట్లాది మంది నోట మాట రాకుండా చేసింది. అంత‌లా మా మోడీ ఏం చేశాడ‌మ్మా?  ఊత్త‌నే మోడీపై విరుచుకుప‌డుతున్నారు అంటూ ద‌న్నుగా దెప్పి పొడిచే బ్యాచులు చాలానే ఉన్నాయి. కానీ.. అలాంటి వారంతా పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌టం.. ఏం చేసినా అద్భుతం.. ఆమోఘం అంటూ కీర్తించే తీరుతో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లు సిగ్గుప‌డేలా తాజా బ‌డ్జెట్ కేటాయింపులు ఉన్నాయ‌ని చెప్పాలి.

బ‌డ్జెట్ లో ప్ర‌క‌టించిన రైతు సాయం విష‌యానికే వ‌స్తే.. ఆ ప‌థ‌కం పేరు ఏం పెట్టినా.. దాని మాతృక తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అమ‌లు చేస్తున్న రైతుబంధు సాయానికి న‌క‌లే. కాపీ కొట్టిన ప‌థ‌కాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టాన్ని రాజ‌కీయ కార‌ణాలుగా అర్జం చేసుకోవ‌చ్చు. కానీ.. ఈ ప‌థ‌కాన్ని గ‌డిచిపోయిన డిసెంబ‌రు నుంచి అమలు చేస్తామ‌ని చెప్ప‌టం చూస్తే.. రానున్న ఎన్నిక‌ల జిమ్మిక్కులో భాగంగానే  మోడీ స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పాలి.

సాంకేతికంగా చూస్తే.. మ‌రో మూడు నెల‌లు అధికారంలో ఉండే అవ‌కాశం మోడీ ప్ర‌భుత్వానికి ఉన్నా.. నైతిక‌త యాంగిల్ లో చూస్తే మాత్రం ఈసీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న చేయ‌టంతో ముగిసిన‌ట్లే. అంటే.. మ‌హా అయితే ఇర‌వై రోజులు ఉన్నాయేమో.

అంత స్వ‌ల్ప వ్య‌వ‌ధికి ప్ర‌భుత్వం చేరుకున్న త‌ర్వాత వార్షిక బ‌డ్జెట్ మాదిరి వ్య‌వ‌హ‌రించ‌టం అభ్యంత‌ర‌క‌రం. నాలుగుళ్లేగా ప‌లు వ‌ర్గాల వారిని ప‌ట్టించుకోని మోడీ స‌ర్కారు ఇప్పుడు మాత్రం వారి మీద వ‌రాలు ప్ర‌క‌టించ‌టం చూస్తే.. నైతిక‌తను నిట్ట నిలువుగా న‌రికేసిన వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News