ఇమ్రాన్ ఖాన్‌ ను కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్న మోదీ

Update: 2019-06-14 06:33 GMT
పాకిస్తాన్ విషయంలో భారత ప్రధాని అనుసరిస్తున్న ఎత్తుగడలు కొత్తగా ఉన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నిసార్లు చర్చలకు సంకేతాలు పంపుతున్నా మోదీ మాత్రం కొంచెం కూడా స్పందించడం లేదు. తాజాగా.. ఇమ్రాన్ మరోసారి.. తమకు - భారత్‌ కు మధ్య కశ్మీర్ తప్ప రెండో సమస్య లేదని.. భారీ మెజారిటీతో గెలిచిన మోదీ రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం కృషి చేయాలని కోరారు. కానీ.. మోదీ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకారం అందించడం ఆపేవరకు చర్చించేది లేదని తేల్చి చెప్పేశారు.

మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోంది. అదేసమయంలో చైనాతోనూ కొన్ని విషయాల్లో విభేదాలున్నా కూడా భారత్ విషయంలో చైనా ఇటీవల కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పైగా కిర్గిజిస్తాన్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మోదీతో సమావేశమయ్యారు. ఆయన ఈ ఏడాది భారత్ రానున్నారు కూడా.

ఈ పరిణామలన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్‌ అన్ని రకాలుగా ఏకాకిగా మారుతోంది. భారత్ లక్ష్యం కూడా అదే. పాక్‌ ని ఏకాకిని చేసి కాళ్లబేరానికి తెచ్చుకునే దిశగా మోదీ వేస్తున్న వ్యూహాలు ఫలిస్తున్నాయని విదేశాంగా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో చైనా సహా ఏ దేశం కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడే పరిస్థితి కానీ, ఆర్థిక సహాయం అందించే పరిస్థితి కానీ లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో మూడేళ్లలో పాకిస్థాన్ ఆర్థికంగా పూర్తిగా క్షీణించడం ఖాయం.. అప్పటికి కానీ ఆ దేశం ఉగ్రవాద భూతం వల్ల కలిగే నష్టమేంటో అర్థం చేసుకోలేదు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తన తీరు మార్చుకుంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోయినా కూడా ఆ దేశానికి భారత్ సహకారం అందించే అవకాశం ఉంటుంది.
 
Tags:    

Similar News