కశ్మీర్ అంశంపై మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం.. వాయు వేగంతో తమ నిర్ణయానికి చట్టబద్ధత కల్పిస్తూ తీసుకున్న వైనం జాతీయస్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తికరంగా మారింది. గతానికి భిన్నంగా మోడీ సర్కారు తీసుకున్న చారిత్రక నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కావటమే కాదు.. మోడీ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. వివిధ అంశాల మీద మోడీని వ్యతిరేకించేవారు సైతం.. కశ్మీర్ విషయంలో ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
70 ఏళ్లుగా నలుగుతున్న సమస్యను ఒక కొలిక్కి తీసుకొస్తూ.. అప్పట్లో జరిగిన తప్పును మోడీ సరి చేసినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికరణం 370పై యావత్ దేశం మూడ్ ఒకలా ఉంటే.. కశ్మీర్ వ్యాలీలోని వారి మూడ్ మరోలా ఉందని చెప్పకతప్పదు. ఇదిలా ఉంటే.. కశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయంపై పాక్ రగిలిపోతోంది. ఊహించని రీతిలో తీసుుకున్న ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న దాయాది.. ఏదోలా భారత్ ను బద్నాం చేయాలని విపరీతంగా శ్రమిస్తోంది.
ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేయించి తన మిత్రుడు చైనాతో కలిసి భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వైనం తెలిసిందే. ఇంటా బయటా ప్రతికూలతను ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్.. తాజాగా తన హద్దులు దాటి మరీ వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
దాదాపు 30 నిమిషాల పాటు వారి ఫోన్ సంభాషణ సాగటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వారి సంభాషణ మొత్తం కశ్మీర్ అంశం చుట్టూనే తిరిగినట్లుగా తెలుస్తోంది. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల్ని మోడీ ప్రస్తావించారని.. అంతర్జాతీయ సమాజంలో భారత్ ను బద్నాం చేయాలన్నట్లుగా ఆయన తీరు ఉండటంపై తనకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
పాక్ దూకుడును అమెరికా చేత కళ్లెం వేయించేలా మోడీ పావులు కదుపుతున్నట్లుగా చెప్పక తప్పదు. కొంతమంది నేతలు భారత్ కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు శాంతి నెలకొల్పేందుకు అనుకూలంగా లేవన్న మాటను ట్రంప్ తో మోడీ అన్నట్లుగా చెబుతున్నారు. తాజా ఫోన్ సంభాషణ ఇరువురు ప్రముఖుల మధ్య స్నేహపూర్వకంగా సాగినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ను కంట్రోల్ చేయటమే లక్ష్యంగా ట్రంప్ తో మోడీ ఫోన్ కాల్ సాగినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు. దూకుడుగా వెళుతున్న ఇమ్రాన్ ను కంట్రోల్ చేయటానికి అగ్రరాజ్యం సాయాన్ని ప్రధాని మోడీ తీసుకునే ప్రయత్నంలోనే తాజా ఫోన్ సంభాషణ సాగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ట్రంప్ తో ప్రధాని మోడీ మాట్లాడిన 30 నిమిషాల ఫోన్ కాల్ సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేస్తే.. మరోవైపు వైట్ హౌస్ కూడా ఒక ప్రకటన చేసింది. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మోడీతో ట్రంప్ చర్చించారని పేర్కొంది. భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని.. ఈ ప్రాంతంలో శాంతి వెల్లివిరియాలన్న ఆకాంక్షను ట్రంప్ వ్యక్తం చేసినట్లుగా సదరు ప్రకటన కోరింది. వాణిజ్యాన్ని పెంచుకోవటం ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని పేర్కొనటం చూస్తే.. పాక్ ఏం చేయాలన్న విషయాన్ని ట్రంప్ సర్కారు తన ప్రకటనతో స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.