భారతదేశం తీసుకునే విధానపరమైన నిర్ణయాలే కాదు మన దేశంలో జరిగే అంతర్గత విజయాలను సైతం ఓర్చుకోలేని స్థాయికి పొరుగున ఉన్న చైనా చేరిపోయింది! ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ విజయం మనకు ఏ మాత్రం మంచిది కాదని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. ఈ గెలుపు ఇక్కడితోనే ఆగిపోదని 2019లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ పత్రిక అంచనా వేసింది. మోడీ మరింత బలమైన నాయకుడిగా మారుతాడని విశ్లేషించింది.
"అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ వైఖరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. గతంలో భారత్ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ.. ఎవరినీ నిందించేది కాదు. వివాదాల్లో ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండేది. వచ్చే ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలిస్తే.. ఇండియా వ్యవహార తీరు మరింత కఠినంగా ఉండనుంది. అదే జరిగితే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ అసలు వెనక్కి తగ్గబోదు" అని గ్లోబల్ టైమ్స్ కథనం అభిప్రాయపడింది. మోడీ తీరును వర్ణించడానికి ఆ పత్రిక ఒక ఘటనను ఉదహరించింది. మోడీ దీపావళి సెలబ్రేషన్స్‌ను ఇండియా-చైనా సరిహద్దులో చేసుకోవడాన్ని ప్రస్తావించింది. ఇండియా, చైనా సరిహద్దు వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించకపోయినా.. సరిహద్దులో సైనికులతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకొని మోడీ తన కఠిన తీరును చెప్పకనే చెప్పారని ఆ పత్రిక తెలిపింది. అయినా చైనా, రష్యాలతో సత్సంబంధాలు నెరుపుతూ.. మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది.
మొత్తంగా చైనా దేశం తరఫున అధికార పత్రిక కలవరపాటు కనిపించింది. భారతదేశం గతంలో వలే ఇక అంతర్జాతీయ వివాదాల్లో అసలు వెనక్కి తగ్గబోదని టెన్షన్ పడుతుండటం స్పష్టమైంది. మరింత కఠినంగా, దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉండటం చైనా స్థానానికి ముప్పేనని విశ్లేషిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/