సాంకేతి సౌలభ్యాన్ని ఉపయోగించుకొని ప్రజల పల్స్ ను పట్టుకునే నాయకుల్లో ప్రథమ స్థానంలో నిలిచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు తన విశిష్టతను చాటుకున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం విస్తుపోయేలా పెద్ద నోట్లను తక్షణ రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలు సైతం అదే రీతిలో బ్రహ్మరథం పడుతున్నారు. నల్లధనం - అవినీతి పేర్లు వినీ వినీ విసిగి వేసారిన ప్రజానీకం మోడీ నిర్ణయానికి సలాం చేస్తున్నారు. నోట్ల రద్దుతో చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతున్నా అవేమీ కాబోవు నల్లధన జాడ్యానికి ఎక్కువ అన్న రీతిలో - నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా జావాబిస్తున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దును వెనక్కి తీసుకోవాలని ధర్నాలు చేస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాకిస్తూ మోడీ నిర్ణయానికి జేజేలు కొడుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్వహిస్తున్న పార్లమెంటు ఉభయ సభల్ని స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకునేలా జవాబిస్తున్నారు.
సాంకేతికతను వాడుకుని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఎన్నికైన మోడీ మళ్లీ అదే అస్త్రంతో నోటు రద్దుపై దేశ ప్రజల అభిప్రాయాన్ని కోరారు. తన నరేంద్ర మోడీ యాప్ లో ‘జన్ జన్ కీ బాత్’ విభాగం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరగా.. కేవలం 24 గంటల్లోనే 5లక్షల మందికి పైగా జవాబిచ్చారు. అందులో 93 శాతం మంది మోడీ నిర్ణయానికి మద్దతు పలుకుతూ 4 పాయింట్ల కంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. 73శాతం మంది 5/5 పాయింట్ రేటింగ్ ఇచ్చారు. 57 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని అతి గొప్పదిగా - 92 శాతం మంది గొప్పదిగా అభివర్ణించారు. నోట్ల రద్దుతో ఉగ్రవాదం - నల్లధనం - అవినీతి అంతానికి బీజం పడుతుందా అన్న ప్రశ్నకు 86శాతం మంది అవునని సమాధానమిచ్చారు. ఈ వివరాలను నరేంద్రమోడీ.ఇన్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా మోడీ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చారిత్రాత్మక సర్వేలో పాలుపంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సబబే అని సర్వే నిరూపించిందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/