కలుపుకోవాలంటే ఎంత ప్రేమను కురిపిస్తారో.. దూరం పెట్టాలంటే అదే తీరులో వ్యవహరించే వైఖరి ప్రధాని మోడీకి మామూలే. ఎప్పుడు.. ఎవరితో ఎలా ఉండాలన్న విషయంలో ఆయన చాలా స్పష్టతతో ఉంటారు. ఆయన వేసే ప్రతి అడుగు వ్యూహాత్మకంగా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని అతి కష్టమ్మీద ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబుతో మోడీ ఎంతగా రాసుకుపూసుకొని తిరిగిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి స్నేహితుడి పట్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మోడీ వ్యవహరించిన తీరును ఎప్పటికి మర్చిపోలేం.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కాబోయే ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా మోడీ కనిపించిన వెంటనే ఆనందంతో చేతులు ముందుకు జాపి.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశారు. దానికి భిన్నంగా మోడీ తీరు ఉండటంతో ఒక్కసారి షాక్ తిన్న చంద్రబాబు.. వెనక్కి తగ్గి సర్దుకొని కరచాలనంతో సరిపెట్టటం ఇప్పటికి మర్చిపోలేం. ఎన్నికల ముందు చంద్రబాబు అవసరం చాలా ఎక్కువన్న ఆలోచన ఉన్నప్పుడు పూసుకురాసుకు తిరిగిన మోడీ.. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత.. తనతోనే బాబుకు పని ఎక్కువన్న విషయం స్పష్టమయ్యాక ఆయన వైఖరిలో మార్పు వచ్చేసింది. పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవటంలో మోడీ ఎంత మొనగాడన్న విషయం ఈ ఉదంతం చెప్పకనే చెప్పేస్తుంది.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాజ్యసభకు వెళ్లిన మోడీ.. ప్రతిపక్ష సభ్యుల దగ్గరకు తనకు తానే వెళ్లి పలుకరించటం ఇలాంటి కోవకే చెందుతుందని చెప్పాలి. రాజ్యసభలో మోడీ పరివారానికి ఉన్న బలం తక్కువన్న విషయం తెలిసిందే. లోక్ సభలో బలంగా ఉన్న ఎన్డీయే.. రాజ్యసభలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు తీసుకునే నిర్ణయాలకు రాజ్యసభలోని విపక్షాలు మోకాలు అడ్డుతున్న పరిస్థితి. దీంతో.. మోడీ సర్కారు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటోంది.
ఇలాంటి వైఖరిని కాస్త తగ్గించుకునేందుకు.. ప్రధానిగా ఉండి కూడా తానెంత సింఫుల్ గా.. ఆత్మీయంగా ఉంటానన్న విషయాన్ని చాటి చెప్పేందుకు వీలుగా మోడీ తాజా వ్యవహారశైలి ఉందని చెప్పాలి. విపక్ష సభ్యులతో ఎలాంటి భేషజాలు లేకుండా మాట్లాడటం.. వారిని పలుకరించటం లాంటివే కాదు.. సీపీఎం ముఖ్యనేత.. రాజకీయంగా తనను తీవ్రంగా తప్పుపట్టే సీతారాం ఏచూరి భుజం మీద అప్యాయంగా చేతులు వేసి మరి కుశల ప్రశ్నలు వేసిన తీరు చూసినప్పుడు అవసరానికి తగ్గట్లుగా వ్యవహరించటంలో మోడీకి మించినోళ్లు మరొకరు ఉండరన్న భావన కలగటం ఖాయం.