ప్రధాని మోడీ ఎట్టకేలకు ఏపీపై దృష్టి సారించారు. ఏపీ సీఎం చంద్రబాబు పాలనను ఏకిపారేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఐదు లోక్ సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట , తిరుపతి నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
‘సన్’ రైజ్ కోసం ఏపీకి బాబు సూర్యాస్తమయం వంటి పరిస్థితిని తీసుకువస్తున్నారని మోడీ లోకేష్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు గురించి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే ఆలోచిస్తూ ఏపీలోని ఇతర పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించడం లేదని మోడీ మండిపడ్డారు. ఏపీలో భారీగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని.. కొడుకు రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు మిన్నకుండిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావించి మోడీ చంద్రబాబును ఎండగట్టారు. తెలుగు ప్రజలకు అసలైన గర్వకారణమైన ఎన్టీఆర్ ను చంద్రబాబు రెండు సార్లు మోసం చేశారని మండిపడ్డారు. ఆనాడు పార్టీ తీసుకొని.. ఆ తర్వాత ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ తో కలిసి బాబు ఆయన ఆశలకు నీళ్లు వదిలాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని.. ఇప్పుడు ఏపీ ప్రజలకు పొడుస్తున్నారని మోడీ మండిపడ్డారు. అధికారం కోసం ఏపీ అభివృద్ధిని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారన్నారు. ఎన్టీఆర్ విలువలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి టీడీపీ ఎన్టీఆర్ వారసత్వాన్ని , విలువలను త్యజించిందని పేర్కొన్నారు.
ఏపీలో ఒక కుటుంబమే అధికారంలో ఉండడం ద్వారా తెలుగు వారి గౌరవం ఎలా నిలబడుతుందని చంద్రబాబు ఫ్యామిలీ పాలిట్రిక్స్ పై మోడీ నిప్పులు చెరిగారు. లోకేష్ ను రాజకీయాల్లోకి తెచ్చి ఏపీ ప్రజలను బాబు నిర్లక్ష్యం చేస్తూ వారి ఆశలను తుంగలో తొక్కాడని మండిపడ్డారు. పదే పదే మోడీని తిడుతూ తెలుగు వారి సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాబు విఫలమయ్యాడని.. 2019లో ప్రధాని పదవి నుంచి తనను దించేసేందుకు ఇతరులను నిలబెట్టేందుకు బాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.