హెలీకాప్ట‌ర్ ఆగిపోతే...ఫోన్ లోనే మోడీ

Update: 2016-12-11 17:21 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తాను ఎంత భిన్న‌మైన రాజకీయ వేత్త‌నో, అదే స‌మ‌యంలో టెక్నాల‌జీ ప్రియుడినో మ‌రోమారు నిరూపించుకున్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ రాష్ట్రంలోని బహ్రెయిచ్‌ లో జ‌రగాల్సిన‌ పరివర్తన్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌.. హెలీకాప్ట‌ర్ వేరే ప్రాంతంలో దిగ‌డంతో ఫోన్ ద్వారా సబ‌కు హాజ‌రైన వారిని ఉద్దేశించి ప్ర‌సంగించి తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌సంగం నేప‌థ్యంలో మోడీ బహ్రెయిచ్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరిన‌ప్ప‌టికీ.. పొగ‌మంచు, వెలుతురు లేమి కార‌ణంగా హెలీకాప్ట‌ర్‌కు ల్యాండింగ్ అయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. పైలెట్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హరించి ల‌క్నో వైపు దారి మ‌ళ్లించి అక్క‌డ లాండ్ చేయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే త‌ను స‌భకు హాజ‌రు కాక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌సంగించేందుకు మోడీ సిద్ధ‌మ‌య్యారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సెల్ ఫోన్‌కు ఫోన్ చేసి ఆ వేదిక‌గా ప్ర‌సంగించేశారు. ప్ర‌ధానమంత్రి మాట్లాడుతున్న స‌మ‌యంలో మౌర్య త‌న ఫోన్ ను మైక్ ద‌గ్గ‌ర ఉంచి ఆ ప్ర‌సంగాన్ని స‌భకు హాజ‌రైన వారికి వినిపించారు.
Tags:    

Similar News