న‌టిని నోటికొచ్చిన‌ట్లు తిట్టి..మీడియా మీద ప‌డ్డాడే

Update: 2018-03-14 05:03 GMT
నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం.. అది కాస్తా వివాదం కావ‌టం ఆపై దాన్ని మీడియా మీద‌కు తోయ‌టం మామూలే. మిగిలిన వ‌ర్గాల వారితో పోలిస్తే.. రాజ‌కీయ నేత‌ల్లో ఈ తీరు మోతాదు మించి ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది. రాజ్య‌స‌భ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌ఫున సీనియ‌ర్ న‌టి..బిగ్ బి స‌తీమ‌ణి జ‌యాబ‌చ్చ‌న్ ను ఎంపిక చేయ‌టం తెలిసిందే.

ఆమెకు రాజ్య‌స‌భ సీటును కేటాయించ‌టం ప‌ట్ల రాజ్య‌స‌భ స‌భ్యుడు న‌రేశ్ అగ‌ర్వాల్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మాజ్ వాదీ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిపోయారు. ఇక్క‌డితో అయ్య‌గారు త‌న ఆవేశాన్ని.. నిర‌స‌న‌ను ఆపేసి ఉంటే బాగుండేది. అలా ఊరుకుంటే ఆయ‌న న‌రేశ్ అగ‌ర్వాల్ ఎందుకు అవుతారు?

స‌మాజ్ వాదీపార్టీ త‌న‌ను కాద‌ని జ‌యాబ‌చ్చ‌న్ కు రాజ్య‌స‌భ బెర్త క‌న్ఫ‌ర్మ్ చేయ‌టంపై ఫైర్ అయిన ఆయ‌న‌.. జ‌యాబ‌చ్చ‌న్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య చేశారు. త‌న లాంటి వాడికి కాకుండా సినిమాల్లో డ్యాన్సులు చేసుకునే వారికి స‌మాజ్ వాదీ పార్టీ టికెట్ ఇచ్చిందంటూ నోరుజారేశాడు. ఈ వ్యాఖ్య‌లు పెనుదుమారాన్ని రేప‌ట‌మే కాదు.. సీన్లోకి పార్టీల‌కు అతీతంగా మ‌హిళా నేత‌లంతా ఎంట‌ర్ అయ్యారు.

కేంద్ర‌మంత్రులు సుష్మా స్వ‌రాజ్.. స్మృతి ఇరానీ లాంటి బీజేపీ సీనియ‌ర్ నేత‌లు మొద‌లు ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మామూలుగా అయితే తాన‌న్న మాట‌కు ప‌క్క‌కు రాని న‌రేశ్ అగ‌ర్వాల్.. కొత్త‌గా చేరిన పార్టీకి చెందిన సీనియ‌ర్లు సైతం సీరియ‌స్ కావ‌టంతో నాలుక క‌ర్చుకున్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేసే ప‌నిలో ప‌డ్డారు. తాను జ‌యాబ‌చ్చ‌న్ ను ఏమీ అన‌లేద‌ని.. మీడియా మీద‌కు నెట్టేశారు. త‌న మాట‌ల్ని మీడియా వ‌క్రీక‌రించిన‌ట్లుగా చెప్పారు. ప‌నిలో ప‌నిగా.. త‌న మాట‌లు బాధించి ఉంటే క్ష‌మించాలంటూ ఇష్యూను క్లోజ్ చేసే ప‌నిలో ప‌డ్డారు.

ఈ ఎపిసోడ్ పై జ‌యాబ‌చ్చ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఆమె ఈ అంశంపై స్పందిస్తూ.. తాను చాలా మొండి మ‌నిషిన‌ని.. ఇలాంటి వాటికి తాను అస్స‌లు స‌మాధానం ఇవ్వ‌న‌ని పేర్కొన్నారు.  త‌న‌పై నోరు జారిన ఎంపీకి చుర‌క అంటిస్తూనే.. తాను మాత్రం కంట్రోల్ త‌ప్ప‌ని జ‌యాబ‌చ్చ‌న్ రియాక్ష‌న్ ఇప్పుడు అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.
Tags:    

Similar News