వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఇపుడు అందరికీ బాగా తెలిసిపోయారు. ఆయన వైఎస్సార్ తో పాటుగా నాడు కాంగ్రెస్ లో ఉన్నా, టీడీపీలో చేరి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగినా కానీ రాని పేరు జగన్ పార్టీలో చేరి ఎంపీ అయ్యాకనే వచ్చింది. అది కూడా జగన్ మీద ఆయన తిరుగుబావుటా ఎగురవేసిన మీదటనే బాగా పాపులర్ అయ్యారు. జగన్ క్రేజ్ మోజూ పీక్స్ లో ఉండగానే రాజు గారు ధిక్కార స్వరం వినిపించి అందరినీ తన వైపుగా తిప్పుకున్నారు.
రాజు గారు ఢిల్లీలో రచ్చబండ పెట్టి ప్రతీ రోజూ వైసీపీ సర్కార్ మీద చేసిన హాట్ హాట్ కామెంట్స్ తో ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలే రేగాయి. ఒక దశలో ఆయన మీద వైసీపీ వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ట్రోలింగ్ చేశారు కూడా. అయినా రాజు గారు దేనివీ వెరవలేదు, నా రూటే కరెక్ట్ అనుకున్నారు. ఇక ఆయన్ని గత ఏడాది పుట్టిన రోజు వేళ హైదరాబాద్ లో ఇంట్లో ఉండగానే ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడాన్ని కూడా ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.
దాంతొ ఆయనకు ఒక్కసారిగా సింపతీ వచ్చేసింది. అది లగాయితు ఏపీలో అసలు సిసలు విపక్ష నేతగా రాజు గారి మారిపోయారు. ఆయన వేస్తున్న పంచులతో అధికార పార్టీలో హాహాకారాలు పుట్టాయి. ఈ క్రమంలో ఆయన తాను నర్సాపురం వస్తానని, సంక్రాంతికి కొత్త కళ తెస్తానని ప్రకటించేశారు. దాంతో ఆయన పుట్టిన గడ్డతో పాటు గెలిపించిన నర్సాపురంలో ఎలా రియాక్షన్ ఉంటుంది అని అంతా ఆసక్తిగా చూశారు.
అయితే ఇపుడు రాజు గారికి వేరే లెవెల్ లోనే స్వాగత సత్కారాలు అందుతున్నాయి. రాజు గారి పేరిట నర్సాపురం లోక్ సభ పరిధిలో అంతటా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసిపోయాయి. ఎటు చూసినా తొడకొడుతున్న రాజు గారి ఫోటోనే కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే రాజు గారు ఈ మధ్యనే తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని ప్రకటించేశారు. దాంతో ఈ ఫ్లెక్సీల్లో ఒక వైపు రాజు ఉంటే మరో వైపు పవన్ కళ్యాణ్ ఫోటోలతో అదుర్స్ అనిపిస్తున్నాయి
తగ్గేదేలే అంటూ క్యాప్షన్ తో ఈ ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తన సొంతూరు భీమవరంలో రాజు గారు రెండు రోజులు ఉంటారు. దాంతో ఆయన చేసే సందడి ఎలా ఉంటుంది. ఆయన మార్క్ పాలిటిక్స్ ఎలా సాగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నర్సాపురంలో ఎటు చూసినా ఇపుడు రాజు గారి హవాయే కనిపిస్తోంది. మరి ఇది కాస్తా పెను తుఫానుగా మారితే త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో రాజు గారే విజయ ఢంకా మోగించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు అంతా.