విక్రమ్ కోసం రంగంలోకి దిగిన నాసా

Update: 2019-09-13 05:18 GMT
చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేందుకు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. మరో ఐదు నిమిషాల్లో సేఫ్ ల్యాండ్ కానుందన్న వేళ.. సంబంధాలుకోల్పోయిన విక్రమ్ ల్యాండర్ వ్యవహారం అందరికి సుపరిచితమే. విక్రమ్ ల్యాండర్ ఎక్కడ ఉందన్న విషయాన్ని ఇప్పటికే గుర్తించింది ఇస్రో. దాంతో సంబంధాలు పునరుద్దరించుకునేందుకు విపరతంగా ప్రయత్నిస్తున్నా.. ఫలితం పాజిటివ్ గా లేదు. ఎందుకిలా జరిగిందన్న అంశం మీద ఇప్పటికే అనాలసిస్ చేస్తున్న ఇస్రో.. తాజాగా ఈ ఇష్యూ మీద నాసా సాయాన్ని కోరినట్లుగా తెలుస్తోంది.

విక్రమ్ స్పందించేలా చేయటం.. ల్యాండర్ తో సంబంధాల్ని పునరుద్ధరించుకునే దిశగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రంగంలోకి దిగింది.  డీప్ స్పేస్ నెట్ వర్క్ సెంటర్లు.. జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ ద్వారా రేడియో సంకేతాల్ని పంపుతోంది. దీంతో పాటు చంద్రుడి కక్ష్యలో ఉన్న తన లూనార్ ఆర్బిటర్ ఈ నెల 17న విక్రమ్ ల్యాండర్ ఉన్న వైపునకు వెళ్లనుంది.

ఆ సమయంలోనే ఫోటోల్ని తీస్తుందని నాసా భావిస్తోంది. తాము తీసే చిత్రాల్ని ఇస్రోతో పంచుకోనున్నట్లు నాసా చెబుతోంది. ఇంతకీ.. తాజా ప్రయోగంలో ఇస్రోకు సాయం చేయటానికి నాసా ఎందుకు ముందుకొచ్చిందంటే.. దానికో కారణం లేకపోలేదు.  చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు నాసా తన వ్యోమోగాముల్ని 2024లో పంపనుంది. దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

ఇదే ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ ఉండటంతో.. అక్కడి పరిస్థితుల్ని విశ్లేషించటానికి.. విక్రమ్ ల్యాండర్ కు ఎదురైన ఇబ్బందుల్ని అర్థం చేసుకునేందుకు వీలుగా తాజా అధ్యయనం సాగుతుందంటున్నారు. అదే సమయంలో విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన పరికరాల్లోనాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ కు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ యారే ఉంది. తన తర్వాత ప్రయోగానికి ఉపయోగపడేలా విక్రమ్ ల్యాండర్ లో ఎల్ ఆర్ ఏను అమర్చింది.

దీంతో.. విక్రమ్ ల్యాండర్ లో ఏం జరిగిందనే విషయం మీద నాసా సైతం ప్రత్యేకశ్రద్ధను ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉంటే.. విక్రమ్ ల్యాండర్ లో సంబంధాలు పునరుద్దరించుకోవటానికి ఈ నెల 20-21 వరకు మాత్రమే అవకాశం ఉందని.. ఆ తర్వాత చంద్రుడి మీద రాత్రి మొదలవుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News