మనిషి మహా విజయం.. సూర్యుడ్ని టచ్ చేసిన నాసా

Update: 2021-12-16 03:10 GMT
మనిషి పరిణామ క్రమంలో ఎన్నో మజిలీలు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పేది మరో ఎత్తు. భూమికి సర్వం అయిన సూర్యుడ్ని నేరుగా చూడటమే కష్టం. అలాంటిది సూరీడు దగ్గరకు వెళ్లి.. దాన్ని టచ్ చేసే సాహసం చేసింది నాసా.

ఆ ప్రయత్నంలో సక్సెస్ కావటం ద్వారా.. మనిషి మరో మహా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పాలి. సూర్యుడి బాహ్యవలయంలోని ‘కరోనా’ పొరలోకి నాసా ప్రయోగించిన వ్యోమనౌక ప్రవేశించింది. ఖగోళ పరిశోధనల్లో ఈ ప్రయత్నం మరో కీలక మైలురాయిగా చెప్పక తప్పదు.

మూడేళ్ల క్రితం నాసా ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ అనే వ్యోమనౌక భానుడి బాహ్య వాతావరణ పొరను తాజాగా టచ్ చేయటం ద్వారా.. మనిషి మరో అద్భుతాన్ని స్రష్టించారనే చెప్పాలి. ఎందుకంటే.. 11 లక్షల డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతతో మండే అగ్నిగోళాన్ని శోధించేందుకు సంధించిన ఈ వ్యోమ నౌక తన లక్ష్యాన్ని చేరుకుంది. సౌర వాతావణం.. విశ్వంలోని ఇతర నక్షత్రాలకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులు విప్పేందుకు ఈ ప్రయోగం కీలకం కానుంది.

కరోనా పొరపై ఏడేళ్ల పాటు పరిశోధన జరపటమే తాజా ప్రయోగ లక్ష్యం. ఏడు సార్లు చేసే ప్రయత్నాలతో ఈ వ్యోమనౌక 26 సార్లు సూర్యుడికి అత్యంత దగ్గరగా తీసుకెళ్లాలా దీన్ని ప్లాన్ చేశారు. ఏడుసార్లు కరోనాకు సమీపంగా వెళ్లిన వ్యోమ నౌక.. ఈ ఏడాది ఏప్రిల్ 8న పెరీహీలియన్ తో తొలిసారి ఏకంగా కరోనా పొరల్లోకే ప్రవేశించింది.

సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించేకరోనల్ నిర్మాణాల గుండా ప్రవేశించింది.సూర్యుడి ఉపరితలం ఘన రూపంలో ఉండదు.ఈ నక్షత్ర గురుత్వాకర్షణ శక్తి.. ఆయస్కాంత క్షేత్రం. ప్లాస్మాను పట్టి ఉంచలేనంత బలహీనంగాఉన్న అంచును అల్ఫ్ వెస్ ఉపరితలంగా పిలుస్తారు.

దీన్నే సూర్యుడి సరిహద్దుగా చెబుతారు. దాని తర్వాతి భాగం నుంచి సౌర గాలులు ఉత్పత్తి అయి.. సౌర కుటుంబంనుంచి బలంగా వీస్తాయి. అల్ఫ్ వెన్ ఎలా ఉంటుంది? అక్కడి వాతావరణం మాటేమిటి? లాంటివేమీ తెలీవు. దాని గుట్టు విప్పటమే తాజా ప్రయోగ లక్ష్యం. తాజా పరిణామంతో మనిషి సాధించిన అద్భుత ఖగోళ విజయంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News