పెర్సెవరెన్స్ సూపర్ పెర్ఫార్మెన్స్.. అరుణ గ్రహం నుంచి ఈ సారి ఆడియో రిలీజ్!
అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు సహా.. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన పెర్సెవరెన్స్ రోవర్ తన అద్భుతమైన పనితీరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ పలు వీడియోలను షేర్ చేసిన రోవర్.. తాజాగా ఓ ఆడియోను రిలీజ్ చేసింది.
రోవర్ లో బిగించిన సూపర్ మ్యాక్స్ మైక్రోఫోన్ ద్వారా ఆ గ్రహంలో ఏం జరుగుతోందో రికార్డు చేసి పంపింది రోవర్. అక్కడ గాలి ప్రవాహం భీకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మన దగ్గర తుఫాను సందర్భాల్లో వీచే బలమైన గాలులు వచ్చినప్పుడు ఎలాంటి శబ్దాలు వస్తాయో.. రోవర్ పంపిన ఆడియోలో అలాంటి సౌండ్ వినిపించింది.
దీంతోపాటు మరో ఆడియో క్లిప్ ను కూడా సెండ్ చేసింది రోవర్. ఈ శబ్దం మనిషి గుండె కొట్టుకునేప్పుడు వచ్చే లబ్ డబ్ శబ్దాన్ని పోలిఉండడం విశేషం. కాగా.. ఇప్పటికే ఈ పెర్సెవరెన్స్ రోవర్ పలు వీడియోలను పంపిన సంగతి తెలిసిందే. రోవర్ ల్యాండ్ అవుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు వీడియోలను సెండ్ చేసింది.
వీటిని నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. పెర్సెవరెన్స్ పేరుమీదనే ఓ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి.. నేరుగా రోవరే మాట్లాడుతున్నట్టుగా పోస్టులు చేస్తోంది. మార్చ్ 6వ తేదీ నుంచి ఈ రోవర్ అరుణ గ్రహంపై తన వేట మొదలు పెట్టింది. ఇందుకుగానూ తన అమ్ముల పొదిలో 25 హైడెఫినిషన్ కెమెరాలు.. ఐదు వరకు ఆడియో మైక్రో ఫోన్లు ఉన్నాయి.