నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు.. అనే పాటకు ఇటీవల ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ నవవధువు చేసిన నృత్యంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది. ఎంతలా అంటే చిన్న పిల్లల నుంచి ముసలి అవ్వ దాకా బుల్లెట్టు బండి పాట అన్నంతగా ఫేమస్ అయింది. కానీ బుల్లెట్టు బండి క్రేజ్ మాత్రం ఇప్పడిది కాదండోయ్. దశాబ్దాల కాలం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది చేసే డుగ్గు.. డుగ్గు సౌండ్ ఒక ప్రత్యేకత అన్నమాట. బుల్లెట్టు బండి మీద వచ్చే వ్యక్తి... ఆ సౌండ్ తోనే రాయల్ గా కనిపిస్తాడు. అందుకే దీనిపై యువకులకు చాలా మోజు. అయితే ఇకపై చంద్రుడి మీద కూడా ఈ బుల్లెట్టు బండితో చక్కర్లు కొట్టొచ్చు. అయితే మన దగ్గర ఉన్న బుల్లెట్టు కాదులెండి. చంద్రుడి మీద డుగ్గు.. డుగ్గు అనాలంటే ఓ స్పెషాలిటీ ఉండాలి కదా. ఆ స్పెషల్ బండి ఎక్కడ తయారవుతోందో తెలుసా..?
చంద్రుడి మీద బుల్లెట్టు బండితో చక్కర్లు కొట్టాలంటే మామూలు బుల్లెట్టు బండి కాదు స్పెషల్ గా ఉండాలి. అందుకే అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ బుల్లెట్టును రూపొందించింది. చంద్రుడిపై డుగ్గు డుగ్గు అనడానికి వీలుగా నాసా దీనిని డిజైన్ చేసింది. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బుల్లెట్టు బండిని తయారుచేయడం గమనార్హం. చంద్రునిపై మనిషి కాలు మోపి దశాబ్దాలు గడిచింది. అయితే ద్విచక్రవాహనాలు మాత్రం ఇంతవరకు అక్కడ ప్రయాణించలేదు. ఈసారి వెళ్లేటప్పుడు రాకెట్ లో ఈ బైక్ ను కూడా తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
భూమి మీద ఉన్నట్లుగా చంద్రుడిపై చదునుగా ఉండదు. అక్కడి నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. అయినా కూడా బైక్ సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ బైక్ రూపొందించారు. బ్యాటరీతో పనిచేసే ప్రత్యేకమైన ఇంజిన్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని పూర్తిగా ఒకసారి ఛార్జ్ చేస్తే చంద్రుడిపై 70 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే అంటే 112 కి.మీ ప్రయాణం చేయవచ్చన్నమాట. దీని గరిష్ఠ వేగం 10 మైళ్లు. అంటే 16 కి.మీ అన్నమాట. ఈ బుల్లెట్టు బండి బరువు 134 కేజీలు ఉంటుందని సమాచారం.
తొలిసారిగా నాసా తయారు చేసిన ఈ ఆవిష్కరణకు మంచి స్పందన వస్తోంది. చంద్రుడి మీద చక్కర్లు కొట్టడానికి బుల్లెట్టు బండి తయారు చేశారని తెలియగానే చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సోషల్ మీడియాలో ఈ బండి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బుల్లెట్టు బండి పట్ల నెటిజన్లు చాలా ఖుషీ అవుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. నాసా స్పెషల్ బుల్లెట్టు బండి మీద... చంద్రుడిపై త్వరలోనే డుగ్గు... డుగ్గు... అనిపించాలని కామెంట్లు చేస్తున్నారు.