అప్ఘనిస్తాన్ దేశంలో నిన్నటి నుంచి తాలిబన్ల పాలన ప్రారంభమైంది. ఆగష్టు 15న వారు దేశాన్ని ఆక్రమించుకోగా..31 వరకు అమెరికా సైనిక బలగాల ఉపసంహకరణకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత కాబుల్ ఎయిర్ పోర్టును ఆక్రమించుకోవడంతో తాలిబన్ల పాలన ప్రారంభమైనట్లే. అయితే సాంప్రదాయంగా నిన్న ప్రార్థనలు చేసి వారి అధికారికంగా పాలనను ప్రారంభించారు. తాలిబన్లు అప్ఘాన్ ను ఆక్రమించుకోవడంతో చాలా దేశంలోని వారితో పాటు ఇతర దేశాలు కూడా భయాందోళనకు గురవుతున్నాయి. మొన్నటి వరకు అప్ఘాన్ కు మిత్ర దేశంగా ఉన్న ఇండియా అక్కడున్న భారతీయులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ లోని కొందరు ముస్లింలు తాలిబన్ల చర్యలపై మండిపడుతున్నారు.
ప్రముఖ నడుటు నసీరుద్దీన్ షా తాలిబన్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తాలిబన్ల గెలుపుతో భారత్ లోని కొందరు ముస్లింలు సంబరాలు చేసుకుంటున్నారు. వారు ఇస్లాంలోని పాత అనాగరిక సంప్రాదాయాలకు అండగా నిలుస్తున్నారు. ఇది ప్రమాదకర పరిణామానాకి దారి తీస్తుంది' అని వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయింది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. 'సంస్కరించిన ఆధునీకరించిన ఇస్లాం కావాలో లేక తప్పుడు పంథాలో అర్థం చేసుకున్న మధ్య యుగం నాటి అనాగరికత కావాలో తమను తాము ప్రశ్నించుకోవాలి' అని అన్నారు. అలాగే ' హిందుస్తానీ' లేదా భారతీయ ఇస్లాం ప్రపంచంలోని అన్నింటికంటే ప్రత్యేకమైనదని, విభిన్నమైనది. నేను భారతీయ ముస్లింని, నాకు రాజకీయ మతం అవసరం లేదు' అని షా అన్నారు.
నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కొందరు షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. కొంత మంది ముస్లింలను స్టీరియోటైప్లో చూడొద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆయన మాటలకు మద్దతు పలుకుతున్నారు. 'భారతీయ ముస్లింలను తాలిబన్లను ఖండించమని చెబుతున్నారు. వారేమైనా తాలిబన్లను ఎన్నుకున్నారా..? లేదా ఆహ్వానించారా..? ఈ విషయంపై స్పందించాలనే ఉచ్చులో సినీ రంగాన్ని లాగుతున్నారు' అని ప్రముఖ జర్నలిస్టు అన్నారు. అలాగే 'నటుడికి ఆవేశం అనవసరం.. ఆయనకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారు' అని అంటున్నారు.
'భారతీయ ముస్లింలు ఇప్పటికే ఎన్నో రకాల హింసలకు గురవుతున్నారు. ఆర్థకంగా బహిష్కించబడుతున్నారు. మూక హింసలో మగ్గుతున్నారు. మరోవైపు పోలీసులు దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు.. ఇప్పడు తాలిబ్లను మరక వారిపై రుద్దితే రాను రాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాస్తవానికి అలాంటి ముప్పేమీ లేదు. మీరు కొత్తగా ఈ ఆలోచన చేయొద్దు'అని ప్రముఖ జర్నలిస్టు ఆదిత్య మీనన్ అన్నారు.
అయితే నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తున్నారు. ముస్లింల్లో ఆధునిక భావాలు అవసరమని కొందరు అంటున్నారు. 'అవమానవీయ, అనాగరిక తాలిబన్ కు వ్యతిరేకంగా షా మాట్లాడడం కరెక్టేనని సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి అన్నారు. విద్యావంతులు, సృజనాత్మకత ఉన్న ముస్లింలు, ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన వారు ఎవరైనా మానవత్వానికి శత్రువులైన తాలిబన్లకి వ్యతిరేకంగా మాట్లాడుతారని' అన్నారు.
మరోవైపు తాలిబ్లను వారి పాలనను ప్రారంభించారు. ప్రభుత్వంలో మహిళలను కూడా తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. పాత తాలిబన్లలా నడుచుకోమని పూర్తిగా స్వేచ్ఛయుత వాతావరణం కలిపిస్తామని అంటున్నారు. అయితే కింది స్థాయి నాయకులు మాత్రం వారి ఆగడాలను మానుకోవడం లేదు. వ్యతిరేకంగా ఉన్నవారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు అడుగుపెట్టని పంజ్ షీర్ లోకి వెళ్తున్న తాలిబన్లు మరణిస్తున్నారు. పంజ్ షీర్ వాసులు తాలిబన్లు తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా, వారి వైపు రాకుండా పకడ్బందీగా రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటున్నారు.