సీఎంగా 20 ఏళ్లు పూర్తి .. స్నేహితులు ఒక్కరు కూడా లేరట !

Update: 2020-10-16 13:30 GMT
నవీన్ పట్నాయక్...సీఎం అనే పదానికి పర్యాయ పదం. రెండు దశాబ్దాలకుపైగా ఒడిశా అనే పేరుకు ప్రత్యామ్నాయం. తండ్రి బిజూ పట్నాయక్ మరణం తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించిన నవీన్.. ఒడిశాకి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర వహించారు. ఆదివాసీ గిరిజనుల విశ్వాసాన్ని కూడగట్టుకొని గత కోనేళ్ళుగా ఒడిశాని ఇక చక్రాధిపత్యంగా ఏలుతున్నారు.

ఒడిశాకు ఎక్కువ కాలం పనిచేసిన సీఎం ఆయనే. తన కుటుంబీకులెవరూ రాజకీయాల్లో చేరడం బిజు పట్నాయక్ కు ఇష్టం లేదు. కానీ 1997 లో బిజు మరణం తరువాత జనతాదళ్ కు చెందిన సీనియర్లందరూ కలిసి.. తండ్రి మరణంతో ఖాళీ అయిన ఆక్సా లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి నవీన్ పట్నాయక్‌ను ఒప్పించారు. కొద్ది నెలల్లోనే జనతాదళ్ నుంచి విడిపోయి 'బిజూ జనతాదళ్(బీజేడీ)' పేరుతో ప్రాంతీయ పార్టీని 1997, డిసెంబర్ 26న స్థాపించారు నవీన్. తొలినాళ్లలో అన్ని ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేసిన బీజేడీ.. 2009 నుంచి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతూ విజయపరంపరను కొనసాగించింది.

సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ మచ్చలేని నేతగా, నిజాయితీపరుడిగా పేరుపొందారు నవీన్ పట్నాయక్. ఒడిశా సంస్కర్తగా ఆయన నిర్ణయాలన్నీ ప్రజల జీవితాల్లో మౌళికమైన మార్పులకు సంబంధించినవే కావడం విశేషం.ప్రస్తుతం పట్నాయక్ 'పీపుల్ సెంట్రిక్' ఫార్ములానే ప్రధానంగా పరిపాలన సాగిస్తున్నారు. అంటే, పౌరులే కేంద్రీకృతంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నమాట. తన విధానాల్లో నవీన్ ప్రధానంగా '5టీ'లుగా పేర్కొనే టెక్నాలజీ, ట్రాన్స్ పరెన్సీ, టీమ్ వర్క్, టైమ్, ట్రాన్స్ మిషన్ కు ప్రాముఖ్యం ఇస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన అధికారులు సామాన్య ప్రజలకు ఫోన్లు చేసి, వారికి అందుతోన్న ప్రభుత్వ సేవలను అడిగి తెలుసుకుంటారు. ఇందుకోసం పట్నాయక్ తన ప్రైవేట్ కార్యదర్శి వి కె పాండియన్‌ను కార్యదర్శిగా నియమించారు.

తన మిస్టర్ క్లీన్ ఇమేజ్ కు తగ్గట్టుగా అవినీతిపై పోరాటంలో పట్నాయక్ ముందుంటారు. ఇటీవల అధికార బీజేడీకి చెందిన కలకండి మాజీ ఎమ్మెల్యేను అక్రమాస్తుల కేసులు అరెస్టు చేయించారు. అవినీతి, లంచాలు తీసుకున్న అధికారులను తొలగించడంతో పాటు వాళ్లకు పెన్షన్లను సైతం నిలిపేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతలని వెంటనే పెదవుల నుండి తొలగిస్తారని ఆయనకి పేరుంది. తెల్ల కుర్తా , పైజామా తో తప్ప మరో డ్రెస్ లో అసలు కనిపించరు. గత 20 ఏళ్లుగా ముక్యుమంత్రిగా ఉన్నప్పటికీ రెండు పెంపుడు కుక్కలు తప్ప , స్నేహితులెవరూ లేరని చెబుతారు ఆయన. ప్రఖ్యాత సి-ఓటర్ సర్వే సంస్థ మొన్న జూన్ లో ''స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020'' పేరుతో నిర్వహించిన సర్వేలో నవీన్ పట్నాయక్.. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉండే ఒడిశాలో నవీన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పులు తెచ్చేందుకు ఉపకరించేవే కావడం గమనార్హం. అయితే ఎక్కువ కాలం పాటు విదేశాల్లో ఉండటంతో ఆయనకి ఇప్పటికి కూడా ఓడియా సరిగా రాదు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. శుక్రవారం 74వ పడిలోకి ప్రవేశించిన ఆయన.. కరోనా పరిస్థితుల కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు.
Tags:    

Similar News