కెప్టెన్ కాళ్లుమొక్కిన సిద్దు..

Update: 2017-03-16 10:26 GMT
పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. పంజాబ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన‌ మాజీ క్రికెట‌ర్ సిద్ధూ కూడా క్యాబినెట్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత సిద్ధూ కెప్టెన్ అమ‌రీంద‌ర్ కాళ్లు మొక్కారు. అంద‌రి ముందు ఈ ప్ర‌ముఖ క్రికెట్ స్తార్ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పంజాబ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో సిద్ధూ చివ‌రి నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సిద్ధూకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌ని ఊహాగానాలు వినిపించాయి.  రాజ్‌ భ‌వ‌న్‌ లో జ‌రిగిన వేడుక‌లో గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ సీఎంతో పాటు మంత్రుల‌కు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ స‌మ‌యంలో ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో సిద్ధూకు డీప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కిన‌ట్లు స్ప‌ష్టం కాలేదు.

పంజాబ్ రాష్ట్రానికి అమ‌రీంద‌ర్ సింగ్ 26వ ముఖ్య‌మంత్రి. సీఎంగా అమ‌రీంద‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఇది రెండ‌వ సారి. 2002-2007 మ‌ధ్య ఆయ‌న తొలిసారి సీఎంగా చేశారు. ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హాజ‌ర‌య్యారు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 77 సీట్ల‌ను గెలుచుకుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో లూథియానాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమరీందర్‌సింగ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇదిలాఉండ‌గా...పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయపథంలో నడిపించడంలో అమ‌రింద‌ర్ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News