సరిహద్దుల్లో ఆరాచకం సృష్టిస్తూ.. ఏమీ తెలియని అమాయకత్వంతో అంతర్జాతీయ వేదికల మీద తన దొంగబుద్ధిని ప్రదర్శించటం పాకిస్తాన్ కు అలవాటే. తాజాగా పాక్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా భారత్ మీద తన విద్వేషాన్ని ప్రదర్శించటంతో పాటు.. భారత్ మీద పలు ఆరోపణలు చేయటం తెలిసిందే. పాక్ దొంగ బుద్ధిని నిరసనకారుడి రూపంలో బయటకు రావటమే కాదు.. పాక్ అధ్యక్షుని నోట మాట రాని పరిస్థితి ఎదురైంది.
నవాజ్ షరీఫ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన ఈ ఉదంతంలోకి వెళితే.. వాషింగ్టన్ లో ప్రముఖ మేధో సంస్థ అయిన యూఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ లో నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తున్న సందర్భంలో ప్రసంగానికి ఒక నిరసనకారుడు అడ్డుపడ్డారు.
బలూచిస్థాన్ కు విముక్తి ఇవ్వండంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడ్ని బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సదరు నిరసనకారుడు నవాజ్ నోట మాట రాని విధంగా ఆయన్ను విమర్శిస్తూ.. నువ్వు లాడెన్ స్నేహితుడివి అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనకారుడ్ని హాలు నుంచి బయటకు తీసుకెళ్లిన తర్వాత కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన నవాజ్ షరీప్.. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ మధ్య కాలంలో పాక్ లోని బలూచిస్థాన్ కు స్వేచ్ఛను ప్రసాదించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ. అంతర్జాతీయ వేదిక మీద నవాజ్ షరీఫ్ కు చేదు అనుభవం ఎదురైందని చెప్పక తప్పదు.