అణ్వ‌స్త్రాల‌ను త‌గ్గించుకునే ప్ర‌సక్తే లేదు!... పాక్

Update: 2016-09-21 12:01 GMT
ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ మ‌రింత దురుసుగా వ్య‌వ‌హ‌రించేందుకే సిద్ధ‌ప‌డిన‌ట్టుంది. అణ్వస్త్ర పాట‌వాన్ని లేశ‌మాత్రం కూడా త‌గ్గించుకునే ప్ర‌సక్తే లేద‌ని ఆ దేశం తేల్చిచెప్పింది. ఐక్య‌రాజ్య‌స‌మితిలో ప్ర‌సంగం కోసం అమెరికా ప‌ర్య‌ట‌నకు వెళ్లిన పాక్ ప్ర‌ధాని ఈ మేర‌కు అగ్ర‌రాజ్యానికి తేల్చిచెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో భేటీలో భాగంగా అణ్వ‌స్త్రాల సంఖ్య‌ను త‌గ్గించుకోవాల‌న్న అమెరికా ప్ర‌తిపాద‌న‌ను ష‌రీఫ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ముందుగా భార‌త్ ఆ ప‌ని చేస్తే బాగుంటుంద‌ని కూడా ష‌రీఫ్ వ్యాఖ్యానించారు.

ఈ మేర‌కు ష‌రీఫ్ తో పాటు భేటీలో పాలుపంచుకున్న ఐక్య‌రాజ్య‌స‌మితిలో పాక్ శాశ్వ‌త ప్ర‌తినిధి మ‌లీహా లోధి ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ట్లు పాక్ మీడియా తెలిపింది. న్యూయార్క్ లో నిర్వ‌హించిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా లోధీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక లోధీతో పాటు మీడియా స‌మావేశంలో పాల్గొన్న పాక్ విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి ఐజాజ్ చౌద‌రి మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలో ఏ దేశం కూడా చేయ‌లేని విధంగా ఉగ్ర‌వాద నిరోధానికి పాక్ య‌త్నిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ష‌రీఫ్ కీల‌క ప్ర‌సంగం చేయ‌నున్న ముందు రోజే పాక్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News