భారత్, పాక్ సంబంధాలు విచిత్రకర పరిస్థితుల్లో ఉన్నాయి. సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే నేతలు మాత్రం ఒకరికొకరు ట్వీట్లు - లేఖలతో శుభాకాంక్షలు చెప్పుకొంటూ - పరామర్శించుకుంటున్నారు. మొన్న మన ప్రధాని మోడీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా.. ఇప్పుడు అదే తరహాలో షరీఫ్ మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ లేఖ రాశారు.
భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్యులు ఇటీవలే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే కోలుకొని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆమెకు లేఖ రాశారు. పదిరోజుల క్రితం సుష్మాస్వరాజ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నప్పటికీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అవసరమైన వారికి సాయం చేస్తున్నారు.
సుష్మా అనారోగ్యం నేపథ్యంలో పలు ఇతర దేశాల నేతలు కూడా ఇప్పటికే స్పందించారు. తాజాగా షరీఫ్ కూడా స్పందించారు. రాజకీయాలు వేరు - వ్యక్తిగత సంబంధాలు వేరు అన్న కోణంలో ఆయన కూడా ఈ విషయంలో పెద్దరికంతో వ్యవహరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/